బిగ్ బాస్ 3లో అడుగు పెట్టనున్న మరో ప్రముఖ నటుడు?

ఇప్పుడు తెలుగునాట సెన్సషనల్ షోగా పేరు గాంచిన బిగ్ బాస్ షో కోసం రోజుకొక తాజా విషయం బయటకు వస్తుంది.ఇంకా షో ఎప్పుడు మొదలు అవుతుందో అన్నది క్లారిటీ రాలేదు కానీ షో కి సంబంధించి మాత్రం కంటెస్టెంట్స్ ఎవరు ఉంటారు అన్నది మాత్రం ప్రతీ రోజు ఏదొక విషయం బయటకు వస్తూనే ఉంది.ఇప్పటికే ఎంతో మంది ప్రముఖ నటులు మరియు యాంకర్స్ మరియు సింగర్స్ పేర్లు కూడా వినిపించాయి.

కానీ ఇప్పుడు మళ్ళీ తాజాగా మరో మల్టీ టాలెంటెడ్ నటుడు అయినటువంటి “నోయెల్” కూడా అడుగు పెట్టబోతున్నట్టు సమాచారం. “మగధీర”, “ప్రేమమ్” మరియు “కుమారి 21 ఎఫ్” వంటి మంచి మంచి చిత్రాల్లో కనిపించిన నోయెల్ ఇపుడు బిగ్ బాస్ లో కూడా సందడి చేయబోతున్నాడు.ఇక్కడే చిన్న ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే గత సీజన్లో రోల్ రైడా ర్యాఫిస్ట్ గా ఎంట్రీ ఇవ్వగా ఈసారి మరో ర్యాఫిస్ట్ గా నోయల్ కనపడనున్నారని అంతా అంటున్నారు.ఈసారి ఈ రియాలిటీ గేమ్ షో కు కింగ్ నాగార్జున హోస్ట్ గా నిర్వహించనున్నారు.

error: Content is protected !!