మెగా సోదరుల మధ్య విబేధాలు వచ్చాయా…???

అవునా అంటే అవుననే సమాధానం వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి , సినిమాలు వదిలిపెట్టి పార్టీ కోసం తిరిగారు. ఎన్నికల్లో పోటీ చేశారు. కమ్యూనిస్టులు,బిఎస్పీతో కల్సి పోటీ చేసినప్పటికీ ఒకే ఒక్క సీటు జనసేనకు వచ్చింది. భీమవరం,గాజువాక లనుంచి పోటీచేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓటమి పాలయ్యాడు. ఇక ఏరికోరి మెగా బ్రదర్ నాగబాబుకు నరసాపురం ఎంపీ టికెట్ ఇస్తే ,ఆయన కూడా ఓడిపోయారు. 

పార్టీని ఎలా నిర్మాణం చేయాలి, ఓటమి కి గల కారణాలు ఇలా అన్ని విషయాలపై పవన్ కళ్యాణ్ సమీక్ష చేస్తున్నారు. మరోపక్క గతంలో ఈటీవీలో జబర్దస్త్ ప్రోగ్రాంలో చేసి ఎన్నికల సమయంలో పక్కకు వచ్చేసిన నాగబాబు మాత్రం మళ్ళీ ఆ ప్రోగ్రాం లో జాయిన్ అయిపోయారు. ఎమ్మెల్యే రోజా కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ప్రోగ్రాం రంజుగానే సాగుతోంది. అయితే తాను సినిమాలు వదిలేసి రాజకీయాలపై దృష్టిపెట్టినపుడు నాగబాబు కూడా అలాగే చేస్తే బాగుండేదని పవన్ అంటున్నారట. 

నిజానికి పవన్ ఈ ఆలోచన చేసినపుడు నాగబాబు విభేదించి,డబ్బు ,పాపులార్టీ గల జబర్దస్త్ ప్రోగ్రాం వదులుకోబోనని తెగేసి చెప్పేశాడట. ఇక పవన్ చేసే సమీక్షలకు కూడా నాగబాబు ఖాళీ చేసుకుని వస్తున్నారు. అయితే పవన్ ఎంత వద్దని చెప్పినా సరే , జబర్దస్త్ ప్రోగ్రాం కి వెళ్లడం పవన్ కి ఎంతమంత్రం ఇష్టం లేదని అంటున్నారు. మొత్తానికి అన్నదమ్ముల మధ్య విబేధాలు ఎలా సర్దుమణుగుతాయో,ఇంకా రచ్చ అవుతాయో చూడాలి. 
 

error: Content is protected !!