కన్నడ స్టార్ యశ్ కి వరుస ఇబ్బందులు ఎందుకొస్తున్నాయ్ …. కారణాలు ఇవే ?

కన్నడలో అతను మీడియం రేంజి హీరో యశ్ ‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ కొట్టేసాడు. ఈ సినిమాతో ఒక్కసారిగా సూపర్ స్టార్ స్టేటస్ సంపాదించాడు. కన్నడలో పెద్ద పెద్ద స్టార్లను దాటి ఎదిగిపోయాడు. ప్రస్తుతం అతను నటిస్తున్న ‘కేజీఎఫ్’ రెండో ఛాప్టర్ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. ఐతే కేజీఎఫ్ సినీ కెరీర్ దూసుకుపోతుంటే,అతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన తలనొప్పులు అతడిని వెంటాడుతున్నాయి. ఆ మధ్య యశ్ హత్యకు కుట్ర జరుగుతోందంటూ జరిగిన ఓ ప్రచారం కలకలం రేపగా, అతడి ఇంటిపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేయడం కూడా చర్చనీయాంశమైంది.

తాజాగా తన తల్లి కారణంగా అతను మరోసారి వార్తల్లో నిలిచాడు. ‘కేజీఎఫ్’తో కోట్ల రూపాయలు యశ్ సంపాదించాడు .అంతకుముందు కూడా అతడు కోట్లల్లో పారితోషకం అందుకున్నవాడే. అలాంటిది యశ్ తల్లి బెంగళూరులో తాను అద్దెకు ఉంటున్న ఇంటికి 11 నెలల పాటు అద్దె చెల్లించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. దీనిపై ఆ ఇంటి యజమాని కోర్టుకు కూడా వెళ్లాడు. యశ్ కుటుంబం 2010లో రూ.40 వేల చొప్పున అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకుని ఆ ఇంటికి వచ్చింది. ఇప్పుడా ఇంటి అద్దె ఐదు రెట్లు అయింది.

ఐతే గత ఏడాది ఈ ఇంటికి అద్దె చెల్లించట్లేదంటూ యజమానికి కోర్టుకు ఎక్కాడు. కోర్టు యశ్ తల్లికి మొట్టికాయలు వేస్తూ ఒకేసారి రూ.23 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు యశ్ కుటుంబం నుంచి ఇంటి యజమానికి డీడీ కూడా ఇప్పించింది. యశ్ కొన్నేళ్ల కిందటే ఈ ఇంటి నుంచి కొత్త ఇంటికి వెళ్లిపోయాడు. కానీ అతడి తల్లి మాత్రం ఆ ఇంట్లోనే ఉంటూ వస్తోంది. చివరికి ఆమెను ఆ ఇంటి నుంచి సాగనంపారు. ఇక్కడితో అయిపోలేదు, తాజాగా ఆ ఇంటి యజమాని మళ్లీ పోలీసుల్ని ఆశ్రయిస్తూ,యశ్ తల్లి తన ఇంటిని ధ్వంసం చేసి ఇచ్చిందని, దీనిపై చర్యలు చేపట్టాలని కోరాడు. దీంతో యశ్ పేరు మరోసారి వైరల్ అయింది. మొత్తానికి సినిమా వలన వచ్చిన క్రేజ్ కాస్తా, ఇంటి సమస్యలవలన దెబ్బతింటోంది. 

error: Content is protected !!