“బిగ్ బాస్” లో ఈసారి కూడా సెంటిమెంట్ కొనసాగుతుందా…???

ఉత్తరాదినుంచి దక్షిణాదికి విస్తరించిన బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు స్మాల్ స్క్రీన్ పై కూడా సత్తా చాటిన సంగతి తెల్సిందే. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ అందుకున్న షోలలో “బిగ్ బాస్” కూడా ఒకటి గా చెప్పొచ్చు. ఇప్పటికే రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి కావడంతో ఇక మూడవ సీజన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.అయితే ఇప్పటికే ఈ షో కు కింగ్ నాగార్జున హోస్ట్ గా ఫిక్స్ అయ్యారని టాక్. 

అంతేకాకుండా ఈసారి సీజన్లో చాలా మంది ప్రముఖ నటులు కూడా కనిపించనున్నారని కూడా వార్తలొచ్చాయి. కానీ బిగ్ బాస్ రెండు సీజన్లను గమనించినట్టైతే ఈసారి వారి సెంటిమెంట్ ప్రకారం ఎవరో ఒక సింగర్ కు అవకాశం ఇస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే గత రెండు సీజన్లు చూసుకున్నట్టయితే మొదటి సీజన్లో కల్పన అలాగే రెండో సీజన్లో గీతా మాధురి కనిపించారు.

అలా ఈసారి కూడా ఎవరో ఒకరు అందులోనూ ఇదే “స్టార్ మా” ఛానెల్లో ప్రసారం అయ్యే “సూపర్ సింగర్” ప్రోగ్రాం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారి నుంచే ఒకరు ఈ సీజన్ లో ఉంటారని అంటున్నారు. ఆ లెక్కన దీపూ, సాకేత్, రేవంత్, కృష్ణ చైతన్య, శ్రీ కృష్ణ, రమ్య బెహారా, ఉమా నేహ, అంజానా సౌమ్య,దినకర్ పేర్లు ఈసారి బిగ్ బాస్ సీజన్ 3 కోసం పరిశీలనలో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి సింగర్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అంటున్నారు. 

error: Content is protected !!