పరగడుపున నానబెట్టిన మెంతులను తింటున్నారా …..ఈ ఒక్క నిజం తెలుసుకోకపోతే నష్టపోతారు

పురాతన కాలం నుండి మెంతులు మన వంటింటిలో ప్రముఖమైన పాత్రను పోషిస్తున్నాయి. వంటల్లో మెంతులను వేయటం వలన వంటకు మంచి రుచి,వాసన వస్తుంది. మెంతులు రుచికి కొంచెం చేదుగా ఉంటాయి. పసుపు రంగులో ఉండే మెంతి గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాల కారణంగానే మెంతి గింజల్లో జిగురు, చేదు రుచి ఉంటుంది.మెంతులు చేసే మేలు గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మెంతుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి  ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. మెంతులలో కావలసినంత పీచు వుంటుంది. మెంతులలో  ఇనుము సమృద్ధిగా ఉంటుంది. దీంతోపాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయి.  కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.

ప్రతి రోజు ఉదయం పరగడుపున నానబెట్టిన మెంతులను మరియు ఆ నీటిని త్రాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రాత్రి సమయంలో ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ మెంతులు వేసి నానబెట్టి మరుసటి రోజు ఉదయం మెంతులను మరియు ఆ నీటిని పరగడుపున త్రాగాలి. ఇలా చేయటం వలన మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి.జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి  గ్యాస్,అసిడిటీ,మలబద్దకం వంటి జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. మెంతుల్లో ఉండే జిగురు తత్త్వం పేగుల్లో అల్సర్ లను తగ్గిస్తుంది.

అలాగే పేగుల లోపలి వాపును తగ్గిస్తుంది. మెంతుల్లోని చేదు తత్వాలు కాలేయాన్ని శక్తివంతం చేస్తాయి. అలాగే పోషక తత్వాల విలీనానికి సహాయపడతాయని  ఈ ఆమధ్య జరిగిన అధ్యయనాల్లో తేలింది. మధుమేహం ఉన్నవారికి మెంతులు ఒక వరంగా చెప్పవచ్చు. పరగడుపున నానబెట్టిన మెంతులను తినటం వలన రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దాంతో మధుమేహం అదుపులో ఉంటుంది. పసిపిల్లలకు పాలిచ్చే తల్లులు  రెగ్యులర్ గా నానబెట్టిన మెంతులను తింటే వారిలో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. కొలస్ట్రాల్ తో బాధపడేవారు ప్రతి రోజు నానబెట్టిన మెంతులను తింటే అతి ప్రమాదకరమైన లోడెన్సిటీ లిపో ప్రొటీన్ (ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్) తగ్గుతుందని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది.

error: Content is protected !!