Politics

మూడున్నర ఏళ్ళ క్రితం రోజా సస్పెండ్ అయినా రోజు ఏమి జరిగింది…స్మాల్ రివైoడ్ .

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన రోజా అనగానే అందరికీ ఇట్టే  తెలిసిపోతుంది. ఇప్పుడైతే మరోసారి నెగ్గి అధికార పక్షంగా మారింది కానీ, అప్పట్లో వైసిపి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తనదైన రీతిలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టింది. అప్పట్లో ఏకపక్షంగా ఆమె బహిష్కరణకు గురైంది. న్యాయ పోరాటం చేసినా ఫలితం దక్కకపోవడంతో ఆరోజు నుంచి మళ్ళీ అసెంబ్లీలో ఆమె అడుగుపెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ వైసిపి తరపున నగరి నుంచి మళ్ళీ ఎన్నికై అధికార పక్ష ఎమ్మెల్యేగా ఆమె సభలో అడుగుపెట్టారు. 

ఒకసారి గతంలోకి వెళ్తే, 2015డిసెంబర్ 18ఎపి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో విజయవాడ కాల్ మనీ వ్యవహారం పైన ప్రభుత్వాన్ని వైసిపి టార్గెట్ చేసింది. ఆ సమయంలో వైసిపి ఎమ్మెల్యేగా ఉన్న రోజా ఆనాటి సీఎం చంద్రబాబుపై కొన్ని కామెంట్స్ చేసారు. దీంతో ఆమెను ఏడాది పాటు సభనుంచి సస్పెండ్ చేస్తున్నట్లు శాసన సభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు సభలో ప్రతిపాదించారు. వెంటనే స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మూడ్ ఆఫ్ ది హౌస్ నిర్ణయంగా రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేసారు. విపక్షనేత జగన్ అభ్యంతరం వ్యక్తంచేస్తూ రోజా వివరణ వినాలని కూడా కోరినా, స్పీకర్ ఒప్పుకోలేదు. 

దీంతో చేసేది లేక రోజా బయటకు వెళ్లిపోయారు. కాల్ మనీ వ్యవహారం సైడ్ ట్రాక్ పట్టేలా టిడిపి వ్యూహం అమలు చేసింది. ఇక రోజా హైకోర్టుని ఆశ్రయించింది. సభలోకి రోజాను అనుమతించాలని కోర్టు ఆదేశించింది. సభలోకి వెళ్లబోతుంటే తమకు స్పీకర్ నుంచి ఆదేశాలు లేవని సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. అయితే స్పీకర్ మాత్రం కోర్టు నిర్ణయాన్ని సభలో అమలు చేయాల్సిన అవసరం లేదని తేల్చేసారు. స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయంగా స్పష్టంచేశారు. ఆతర్వాత డివిజన్ బెంచికి ప్రభుత్వం అప్పీలు చేయడంతో రోజాకు అనుకూల ఉత్తర్వులను బెంచి కొట్టేసింది. ఇక ఏడాది అయ్యాక సభలోకి వెళ్లాలని చూసినా కుదరలేదు. ఇక వైసిపి కూడా మొత్తంగా సభను బాయ్ కాట్ చేసింది. మూడున్నరేళ్ల క్రితం విపక్ష ఎమ్మెల్యేగా బహిష్కరణకు గురైన రోజా ఇప్పుడు అధికార పక్ష ఎమ్మెల్యేగా సభలోకి ప్రవేశించి సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయింది.