దాసరి కుమారుడి మిస్సింగ్ మిస్టరీలో ట్విస్ట్.. సీన్‌లోకి మొదటి భార్య!

దర్శకరత్న దాసరి నారాయణ రావుపెద్ద కుమారుడు తారక ప్రభు విషయంలో కొన్ని రోజులుగా నెలకొన్న మిస్టరీకి తెరపడింది. పోలీసులకు ఎట్టకేళకు ఆయన ఆచూకీ దొరికింది. మంగళవారం (జూన్ 18) సాయంత్రం ఆయన తన నివాసానికి చేరుకున్నారు. ఇంటికి తిరిగొచ్చిన దాసరి ప్రభును పోలీసుల అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎందుకు అదృశ్యమయ్యారు? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారు? అనే విషయాలను పోలీసులు ఆరా తీస్తు్న్నారు. 

జూన్ 9న బయటకి వెళ్లిన దాసరి ప్రభు ఆ తర్వాత తిరిగి రాలేదని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. తన అల్లుడు ప్రభు కనపడటం లేదని ఆయన మామయ్య సురేంద్ర ప్రసాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయన గురించి వెతుకులాట మొదలు పెట్టారు. 

దాసరి ప్రభు అదృశ్యం వెనకాల ఆయన భార్య సుశీల, ఆమె తల్లి ఉన్నారేమోనని పోలీసులు అనుమానించారు. దాసరి కుటుంబంలో కొంత కాలంగా ఆస్తి వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. తనకు న్యాయం చేయాలంటూ దాసరి సుశీల పోరాడుతున్నారు. 

అయితే.. కనిపించకుండాపోయిన దాసరి ప్రభు చిత్తూరులో నివాసం ఉంటున్న తన మొదటి భార్య సుశీల వద్దకే వెళ్లినట్లు తెలుస్తోంది. వారం రోజులుగా అక్కడే ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

error: Content is protected !!