MoviesUncategorized

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ అసలు కథ వేరే ఉందని తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని మూవీస్ అద్వితీయ విజయాలను నమోదుచేసుకున్నాయి. ముఖ్యంగా వైజయంతి మూవీస్ బ్యానర్‌లో సి.అశ్వనీదత్ నిర్మాతగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్‌గా నటించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా ఓ అద్భుతం. సినీ ఇండస్ట్రీలో దీనికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా అప్పటి వరకు ఉన్న అన్నిరికార్డులను ఈజీగా క్రాస్ చేసింది. అంతేకాదు హైదరాబాద్‌లోని ‘ఓడియన్ 70 ఎం ఎం’ థియేటర్‌లో ఏకధాటిగా ఒక యేడాది పాటు నాల్గోషోలతో దుమ్మురేపేసింది. ఈ సినిమాలో జగదేకవీరుడుగా చిరంజీవి నటనతో పాటు ఇంద్రుడి కుమార్తె ఇంద్రజగా శ్రీదేవిని తప్పించి మరోకరిని అసలు ఊహించుకోడానికే ఎవరికీ మనసొప్పదు. 

ఇక ఈసినిమాలో దేవలోకం నుంచి వచ్చిన ఇంద్రుడి కుమార్తె ఇంద్రజ ఉంగరం పోగుట్టుకుంటుంది. దాన్ని వెతుక్కుంటూ ఇంద్రజ భూలోకానికి వస్తుంది. ఇది నిర్మాత అశ్వనీదత్‌కు చక్రవర్తి అనే రచయత చెప్పిన స్టోరీ లైన్. దీని ఆధారంగా సినిమా కథ జంధ్యాల తనదైన స్టైల్‌లో రెడీ చేసి కే.రాఘవేంద్రరావు చేతిలో పెట్టారు. ఈ సినిమాకు జంధ్యాల మాటలు కూడా అందించారు. మరి ప్రేక్షకుల్లో చిరంజీవి,శ్రీదేవి అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. దానికి తగ్గట్టు సీన్స్ ఉండాలి కదా. ముఖ్యంగా హీరో, హీరోయిన్లు కలిసే ఫస్ట్ సీన్ పై చిత్ర యూనిట్ ఎన్నో తర్జన భర్జనలు చేసింది. అయితే సినిమాలో మాత్రం వీళ్లిద్దరు మానస సరోవరంలో కలుసుకున్నట్టు చూపించారు.

నిజానికి స్టోరీ ప్రకారం.. ‘గాయపడిన పాపకు చికిత్స కోసం లక్షలు ఖర్చవుతాయని అదే సమయంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్త చంద్రుడి పైకి ఒక మిషన్ నిర్వహించాలనుకుంటోంది. స్పేస్ షిప్‌లో చంద్రుడిపైకి వెళ్లి వచ్చిన వారికి కోట్లలో డబ్బులు ఇస్తామని చెబుతుంది. ఈ ప్రకటన చూసి చిరంజీవి స్పేస్ షిప్‌లో చంద్రుడిపైకి వెళతాడు. అక్కడ విహారానికి వచ్చిన ఇంద్రుడి కుమార్తె ఉంగరం పోగోట్టుకుంటోంది. అది చిరుకు దొరకడంతో దాన్ని వెతుక్కుంటూ శ్రీదేవి భూమి మీదికి వస్తుంది.

ఇది పూర్తి కథ రెడీ కాకముందు అనుకున్న కథ. కానీ చంద్రుడు, స్పేస్ షిప్ ఇవన్నీ సహజంగా ఉండవని దర్శకుడు రాఘవేంద్రరావు, తో పాటు చిత్ర యూనిట్ భావించిందట. దీనిపై చర్చ నడుస్తుండగా, చిరంజీవి ‘మానస సరోవరం’ బ్యాక్ డ్రాప్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పడంతో, అందరికీ అది నచ్చి, కథను ఆ దిశగా రచయతలు రెడీ చేసారు . అలా చిరంజీవి మూలిక కోసం మానస సరోవరానికి వెళ్లడం.. అక్కడ విహారించడానికి వచ్చిన శ్రీదేవి ఉంగరం పోగోట్టుకోవడం..దాని కోసం కథానాయిక భూమి మీదికి రావడం జరుగుతుంది. ఆవిధంగా తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.