కొత్త ఫీచర్లతో త్వరలో విడుదల కానున్న వివో జెడ్1ప్రొ…

చైనాకి చెందిన మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ జడ్1 ప్రొ ను భారత్‌లో అతి త్వరలో విడుదల చేయనుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని కూడా ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు.

కాగా ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనున్నారు. రూ.14,075 ప్రారంభ ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.వివో జడ్1 ప్రొ ఫీచర్లు…

6.53 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై.

16, 8, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
లావా జెడ్62 స్మార్ట్‌ఫోన్…

మొబైల్స్ తయారీదారు లావా తన నూతన స్మార్ట్‌ఫోన్ జడ్62 ను భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. రూ.6060 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.
లావా జడ్62 ఫీచర్లు…

6 ఇంచ్ డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ఎ22 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3380 ఎంఏహెచ్ బ్యాటరీ.

error: Content is protected !!