మళ్ళీ “కొంచెం టచ్ లో ఉంటే చెప్తా” అంటున్న ప్రదీప్.!

రెండు తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ ప్రదీప్ తెలీనివారు ఎవరు ఉండరు.తనదైన శైలి కామెడీ టైమింగ్ తో అనేక షోలలో వ్యాఖ్యాతగా అలరించేవాడు.అయితే తన స్వీయ నిర్మాణం మరియు తానే యాంకర్ గా సక్సెస్ ఫుల్ గా రన్ చేసిన షో ఏదన్న ఉంది అంటే అది”కొంచెం టచ్ లో ఉంటే చెప్తా” షో అనే చెప్పాలి.టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోలు మరియు హీరోయిన్ల సహా ఇతర ముఖ్య సెలెబ్రెటీలను ఆహ్వానించి ప్రదీప్ షో చేస్తారు.

ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు నాలగవ సీజన్లోకి ఎంటర్ అవుతుంది.దీనికి సంబందించిన ప్రోమో టీజర్ ను కూడా ప్రదీప్ అద్భుతంగా డిజైన్ చేసారు.మరి ఈసారి సీజన్ ఎలా ఉండబోతుందో ఇంకొన్ని రోజులు ఆగి చూడాల్సిందే.ఇంకా ఎప్పుడు నుంచి టెలికాస్ట్ కాబోతుందో వెల్లడి చేయకముందే బుల్లి తెర ప్రేక్షకుల నుంచి ఇప్పటి నుంచే ఈ షో పై నెటిజన్స్ అమితమైన ఆసక్తి కనబరుస్తున్నారు.ఈ ప్రోగ్రాం జీతెలుగు ఛానెల్లో ప్రసారం అవుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే.

error: Content is protected !!