రాజ భవనం నుండి పెంకుటిల్లు…. చంద్రబాబు నివాసం చూస్తే షాక్

ఇన్నాళ్లూ అధికారం అనుభవించి గడిచిన ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ప్రజల మధ్య ఉంటూ పోరాటాలను ఎంచుకోవాలని సిద్ధం అవుతున్నారట. ప్రజల మధ్య ప్రతిపక్ష నేత గా ఉండడానికి ఉండవల్లిలో ఓ పెంకుటిల్లుని మరమ్మత్తులు చేయించుకుంటున్నారట. ఇక అదే చంద్రబాబు అధికారిక నివాసం అవుతుందని కూడా తెలుగు తమ్ముళ్లు చెప్పేమాట. పురాతనమైన ఆ పెంకుటిల్లు యజమాని శాంతమ్మ. గ్రామ సర్పంచ్ గా కూడా  పనిచేసారు.

ఈ పాత ఇంటికి మరమ్మత్తులు చేయించి,అతి పెద్ద బంగ్లా నుంచి మారడం వెనుక ఆంతర్యం ఏమిటి అనే  ప్రశ్నలు వస్తున్నాయి. కరకట్ట దగ్గర లింగమనేని నిర్మించిన పెద్ద ఇంటిని తీసుకుని నివాసం ఉంటున్నారు. అయితే అది అక్రమ కట్టడమని ఇప్పుడు ప్రభుత్వం పేర్కొంటూ నోటీసు కూడా సి ఆర్ డి ఏ అధికారులు అంటించారు. ఈ ఇంటి పక్కనే ప్రజావేదిక భవనాన్ని గతంలో ప్రభుత్వం నిర్మించింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ ప్రజావేదిక భవనాన్ని ఎపి సీఎం జగన్ కూచివేయించడంతో పాటు కరకట్ట దగ్గర అక్రమంగా నిర్మించిన భవనాలకు నోటీసులు కూడా పంపించారు.

అయితే ప్రజావేదిక తర్వాత కూల్చబోయే ఇల్లు చంద్రబాబు అద్దెకు ఉండే ఇల్లుగా చెబుతున్నారు. అక్రమంగా నిర్మించిన ఇంట్లో ఎలా ఉంటారని అధికార వైసిపి నేతలు ప్రశ్నించడంతో ఇక వేలు ఎత్తిచూపడానికి వీలు లేకుండా ఉండేందుకు బాబుకి అనువైన ఇంటికోసం టిడిపి నేతలు ప్రయత్నించి,పెంకుటిళ్ళుని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అధునాతన భవనం లో విలాసవంతమైన జీవితం అనుభవిస్తారన్న విమర్శా ఉన్నందున వీటికి చెక్ పెట్టేవిధంగా 90ఏళ్లనాటి పెంకుటిల్లు టీడీపీ నేతలు సెలెక్ట్ చేసారు. ఇక చంద్రబాబు టేస్ట్ కి తగ్గట్టు కొన్ని మార్పులు చేస్తున్నారు. సెక్యూరిటీ పరంగా ఇంటి పరిసరాలు కూడా విశాలంగా ఉన్నాయి. ఇక చంద్రబాబు అంతిమ నిర్ణయం తీసుకోవాల్సి ఉందట.

error: Content is protected !!