అఖిల్ సినిమా ఆగటానికి కారణం ఏమిటో తెలుసా?

దేనికైనా లక్కుండాలని అంటారు. అది అక్షరాలా  అక్కినేని వంశానికి మూడో తరం వారసుడు అఖిల్ విషయంలో స్పష్టం అవుతోంది. మూడు సినిమాలు చేసినా హిట్ దక్కలేదు.  అఖిల్  కి అందం, అభినయ సామర్ధ్యం, బలమైన కుటుంబ నేపధ్యంతోపాటు ఇండస్ట్రీ నుంచి భారీ సపోర్ట్ ఉన్నప్పటికీ ఎందుకో కనీస స్థాయి హిట్ కూడా కొట్టలేకపోతున్నాడు. ఇప్పటికే “అఖిల్, హలో, మిస్టర్ మజ్ను” చిత్రాలతో హ్యాట్రిక్ ఫ్లాప్ అందుకొన్నాడు.  దాంతో బాబు అసలు హిట్ ఎప్పుడు కొడతాడా అని అక్కినేని ఫాన్స్ వేయికళ్లతో  ఆశగా ఎదురుచూస్తున్నారు.    

ఇక ఆ మధ్య  బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ కొత్త సినిమా లాంఛనంగా మొదలవ్వడంతో అందరూ  కాస్త ఊపిరి పీల్చుకొన్నారు. డైరెక్టర్ కి సక్సెస్ రేట్ పెద్దగా లేకపోయినా, గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ కావడంతో అల్లు అరవింద్ అన్నీ చూస్తాడులే  అని భావించారు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచిందన్నట్లు,  ఇప్పుడు అది  కూడా ఆగిపోయిందని టాక్ వినిపిస్తోంది. అయితే.. ఆగిపోవడం అంటే మొత్తానికి ఆగిపోవడం కాదు. ప్రస్తుతానికి ఆగిందని అర్ధం.
  

దీనికి  కారణం ఆరా తీస్తే, అఖిల్ సరసన సరైన కథానాయిక దొరకలేదట.  అక్కినేని అందగాడి సరసన తొలుత రష్మిక మందన్న అయితే బాగుంటుందని భావించారు. అయితే, మహేష్ బాబు, అల్లు అర్జున్ లతో వరుస సినిమాలు చేస్తూ, యమ బిజీగా ఉన్న రష్మిక నో చెప్పడంతో,  హీరోయిన్ దొరికే వరకూ ప్రొజెక్ట్ ను పక్కకు తోసేశారట.  అఖిల్ కి  హీరోయిన్ దొరికితేనే ఈ  సినిమా సెట్స్ కు వస్తుందట. అలాగైతే ఇది  ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎప్పటికీ అఖిల్ కి ఒక హిట్ దొరుకుతుందో వేచి చూడాలి. 

error: Content is protected !!