అమెరికా అమ్మాయి మెరీనా పెళ్లి ఎంత విచిత్రంగా జరిగిందో?

టివి చానల్స్ లో వచ్చే టివి సీరియల్స్ కి ఉండే గిరాకీ మామూలు రేంజ్ లో లేదు. ఇక వీటిల్లో నటించే వాళ్లకు క్రేజ్ అలానే ఉంది. ఇక జి తెలుగులో ప్రసారమయ్యే అమెరికా అమ్మాయి సీరియల్ లో అమెరికా నుంచి వచ్చిన అమ్మాయిగా మెరీనా ఎంట్రీ ఇచ్చింది. తన అమ్మ ఇచ్చిన తులసి మొక్కను చేతితో పట్టుకుని వజ్రపాటి ఇంట్లో అడుగుపెట్టిన అమ్మాయి సమంత. 1987జూన్ 14న గోవాలో పుట్టిన ఈమె అసలు పేరు మెరీనా అబ్రహం. 

ముంబయి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తిచేసింది. కొన్ని సినిమాల్లో కూడా నటించిన ఈమె మోడల్ గా పనిచేస్తున్న సమయంలో అమెరికా అమ్మాయి సీరియల్ లో ఛాన్స్ వచ్చింది.
 జి కుటుంబానికి ,నాకు మంచి అనుబంధం ఉందని,నటిగా జి తెలుగు మంచి గుర్తింపు తెచ్చిందని మెరీనా చెబుతోంది. ఒక సినిమాలో కల్సి నటించిన తోటి నటుడు రోహిత్ ని ఈమె ప్రేమించి పెళ్లిచేసుకుంది. కంటే కూతుర్ని కనాలి సీరియల్ లో కూడా యాక్ట్ చేసాడు. 2017నవంబర్ 29న వీరిద్దరి పెళ్లి జరిగింది.

నిజానికి షూటింగ్ లొకేషన్ లో మొదలైన  ప్రేమ పెళ్లిగా ఎలా మారిందో మెరీనా వివరించింది. 2014మార్చి1న తన లవ్ ప్రపోజ్ చేసిందట. అయితే ఏడాది సమయం అడగడంతో తనలోని లవ్ ని చెబితే ఫోజ్ కొడుతున్నాడని బాధ పడిందట. అయితే తనంతట తానె రోహిత్ వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించాడట. పెళ్లయ్యాక రోహిత్ తనపట్ల చాలా కేర్ తీసుకుని మాట్లాడతాడని, ఇలాంటి వ్యక్తి భర్తగా రావడం నిజంగా అదృష్టమని చెప్పుకొచ్చింది. ఇక ఇద్దరూ కల్సి ఓ సీరియల్ లో యాక్ట్ చేయాలనీ ఉందట. అలాంటి క్యారెక్టర్  వస్తే బాగుండునని కోరుకుంటోంది. 

error: Content is protected !!