రోజా సత్తాకి పరీక్ష : ఆమె ముందున్న సవాళ్లను అధికమిస్తుందా?

అధికారంలోకి రావడం ఒక ఎత్తు అయితే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం మరో ఎత్తు. సరిగ్గా ఇప్పుడు చిత్తూరు జిల్లా నగరి నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచిన వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా పరిస్థితి అలాగే ఉంది. దీనికి కారణం ఆమె మీద నియోజకవర్గ ప్రజలు భారీ ఆశలే పెట్టుకున్నారు. రోజా మంత్రి అవ్వటం ఖాయం తమ నియోజకవర్గం బాగా డెవలప్ అవుతుందని అనుకున్నారు, కానీ ఆమెకి మంత్రిపదవి దక్కలేదు. మంత్రిపదవి లేకపోయిన అధికార పార్టీ కాబట్టి ఆమె ఎక్కువ పనులు చేపించటానికి వీలు ఉంటుంది. అయితే నగరిలో అనేక సమస్యలు రోజాకి సవాళ్లుగా మారాయి. 

వివరాల్లోకి వెళ్తే, 1983 లో ఎన్టీఆర్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పడకలు పెంచాలనే ఉద్దేశ్యంతో స్థలం కేటాయించినప్పటికీ ఇంతవరకూ దానికి మోక్షం లేదు. 30 పడకల ఉన్న హాస్పెటల్ ని 50 లేదా 100 పడకలకి మార్చి ఆ స్థానంలో విస్తీరణ చేపట్టాలి. లేకపోతే అక్రమాలకి గురైయే అవకాశం ఉంది. అదే విధంగా పిళ్లారిపట్టు పాలిటెక్నిక్‌ కళాశాలకు భూమి, నిధులు ఉన్నా భవన నిర్మాణాలు అవ్వలేదు. దాంతో అరువుకు ఇచ్చిన ఇరుకు గదుల్లో కాలం గడుపుతున్నారు. ఈ విషయమై కూడా చొరవ తీసుకుని భవన నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవం జరిపించాల్సి ఉంది. 

ముఖ్యంగా నగరిలో సాగు,తాగు నీటి సమస్య ప్రధానంగా మారిందని చెప్పాలి. దానిని నివారించటానికి గాలేరు-నగరి కాలువకు అనుసంధానంగా వేణుగోపాలసాగర్‌ రిజర్వాయర్‌, పుత్తూరు సమ్మర్‌స్టోరేజీ, వేపగుంట రిజర్వాయర్‌, అడవికొత్తూరు రిజర్వాయర్లను నిర్మించారు. ఇందులో పుత్తూరు సమ్మర్‌స్టోరేజీ, వేపగుంట రిజర్వాయర్‌, అడవికొత్తూరు రిజర్వాయర్ల దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతావాటిని పూర్తిచేసి తెలుగుగంగ నుండి నీళ్లను తెచ్చుకోగలిగితే ఆ ప్రాంతంలో నీటి సమస్య తగ్గినట్లే. రైల్వే సమస్యలు, ఉర్దూ పాఠశాల నిర్మాణాలు ఇలా అనేక రకాలైన అభివృద్ధి పనులు ఆగిపోయాయి. మరి ఇవన్నీ రోజా ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. 

error: Content is protected !!