మంచు మనోజ్‌ వైవాహిక జీవితం, సినిమా కెరీర్‌కు అసలేం అయ్యింది….???

మంచు మనోజ్‌ సినిమా వచ్చి దాదాపుగా రెండేళ్లవుతుంది. ఇతగాడు కొత్త సినిమాలు చేస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇతగాడు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సామాజిక కార్యక్రమాల పేరుతో చిత్తూరు జిల్లాలోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమాలకు దూరంగా ఉండటంతో పాటు భార్యకు కూడా మంచు మనోజ్‌ దూరంగా ఉంటున్నట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

గత కొన్ని రోజులుగా ఏ కార్యక్రమంలో కాని, ఏ వేడుకలో కాని మంచు మనోజ్‌ తన భార్యతో కనిపించలేదు. దాంతో ఇద్దరు విడిపోయారా లేదంటే దూరంగా ఉంటున్నారా అంటూ రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. భార్య భర్తలు బాహాటంగా కనిపించకుంటే విడిపోయినట్లా అంటూ మంచు ఫ్యామిలీకి సంబంధించిన కొందరు సోషల్‌ మీడియా జనాలను ప్రశ్నిస్తున్నారు. అయితే వారు మాత్రం అసలు విషయం తెలియజేయడం లేదు. మంచు మనోజ్‌ వైవాహిక జీవితం ప్రస్తుతం ఎలా ఉందనే విషయంపై ఎవరికి క్లారిటీ లేదు.
 

గత కొంత కాలంగా తండ్రి మరియు అన్నలతో కూడా మంచు మనోజ్‌ కలిసినట్లుగా అనిపించడం లేదని, కుటుంబ సభ్యులతో విభేదాలు ఉన్నాయా అంటూ పుకార్లు గుప్పుమంటున్నారు. ఆమద్య వీరి కళాశాలకు సంబంధించిన వ్యవహారంపై మంచు మనోజ్‌ స్పందించాడు. ఆ సమయంలోనే తండ్రితో కలిశాడు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు కూడా తండ్రితో కలిసింది లేదు. ఇక సినిమా విషయంలో కూడా మంచు మనోజ్‌ నిర్ణయం సినీ వర్గాల వారిని ఆశ్చర్యపర్చుతోంది.

ఈయనతో సినిమాలు చేసేందుకు చాలా మంది నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. కాని ఈయన మాత్రం సినిమాలను వాయిదాలు వేస్తూ వస్తున్నాడు. ఇంతకు మంచు మనోజ్‌ సినీ కెరీర్‌ మరియు వైవాహిక జీవితంకు ఏమైందంటూ నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు. తిరిగి మంచు మనోజ్‌ యదాస్థితికి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి.”,

error: Content is protected !!