నిహారిక సంచలన నిర్ణయం.. సినిమాలకు గుడ్ బై..!

మెగా డాటర్ గా ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి వరసగా మూడు సినిమాలలో నటించినా ఆమూడు సినిమాలు ఫ్లాప్ లుగా మారడంతో నిహారిక చిట్టచివరకు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఒక యంగ్ డైరెక్టర్ ఈమధ్య నిహారికను కలిసి ఒక మంచి కథను వినిపించాలని ప్రయత్నిస్తే ఆమె సున్నితంగా నో చెప్పినట్లు సమాచారం. అంతేకాదు తనకు ఇంక సినిమాలలో నటించే ఆసక్తి లేదని ఇప్పుడు తన దృష్టి అంతా తాను స్థాపించిన ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్ పై ఉన్నట్లు స్పష్టమైన క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ బ్యానర్ పై కొన్ని వెబ్ సిరీస్ ల నిర్మాణంతో పాటు మెగా యంగ్ హీరోల సపోర్ట్ తీసుకుని తాను నిర్మాతగా మారబోతున్న విషయాన్ని కూడ నిహారిక ఆ యంగ్ డైరెక్టర్ కు లీక్ చేసినట్లు టాక్. దీనితో నిహారిక ఫిలిం కెరియర్ మూడు సినిమాలతోనే పరిసమాప్తం అయింది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు హడావిడి చేస్తున్నాయి. ‘ఒకమనసు’ ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్యాకాంతం’ సినిమాల విషయంలో ఒక సినిమాతో మరొక సినిమా సంబంధం లేకుండా స్క్రిప్ట్ లు ఎంచుకున్నా వరస పరాజయాలు పలకరించడం ఆమెను నిరాశ పరిచినట్లు టాక్. దీనికితోడు నిహారికకు 26 సంవత్సరాలు దాటిపోతూ ఉండటంతో ఇంకా ప్రయోగాల దశలోనే కాలం గడుస్తున్న నేపధ్యంలో నిహారిక ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు టాక్. నిహారిక నిర్ణయం వెనుక మెగా ఫ్యామిలీ ప్రభావం కూడ ఉంది అన్న వార్తలు వస్తున్నాయి.

నయనతార సమంతల రేంజ్ లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు చిరునామాగా మారాలని ప్రయత్నాలు చేసిన నిహారిక తొలి ఇన్నింగ్స్ లోనే వెనుదిరిగి పోవడం ఒకవిధంగా మెగా అభిమానులకు నిరాశ కలిగించే విషయం..

error: Content is protected !!