బిగ్ బాస్ విజేత అవ్వడానికి కౌశల్ చేసింది ఇదేనా..! ఫైరవుతున్న నెటిజన్స్

బిగ్ బాస్ 3 కంటెస్టెంట్‌లకు సలహా ఇచ్చేలా సీజన్ 2 విజేత కౌశల్ ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేయగా…దీనిపై నెటిజన్స్ సెటైర్లు విసురుతున్నారు. త్వరలో ప్రారంభంకానున్న బిగ్ బాస్ మూడో సీజన్‌పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంటోంది. బిగ్ బాస్ 3 హోస్ట్‌గా అక్కినేని నాగార్జున పేరు అధికారికంగా ఖరారు కావడం తెలిసిందే. కంటెస్టెంట్స్‌గా శ్రీముఖి, వరుణ్ సందేశ్, రవికృష్ణ, తీన్మార్ సావిత్రి తదితరులను ఖరారుచేసినట్లు తెలుస్తోంది. మరికొందరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 21 నుంచి ‘స్టార్ మా’లో ‘బిగ్ బాస్ 3’ ప్రసారాలు ప్రారంభంకావచ్చని సమాచారం.

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 2 విజేత కౌశల్ తన సక్సస్ సీక్రెట్ ఇదే అన్నట్లు సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఇందులో మన వెనుక నుంచి మాట్లాడే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని కౌశల్ పేర్కొన్నాడు. బిగ్ బాస్2 హౌస్‌లో సహ కంటెస్టెంట్ నూతన్ నాయుడుతో కౌశల్ ముచ్చటిస్తున్న వీడియో అది. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ కోసం అన్నట్లు కౌశల్ ఈ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.కౌశల్ పోస్ట్ పట్ల కొందరు నెటిజన్స్ సటైర్స్ వేస్తున్నారు. గతాన్ని గుర్తుచేసుకుంటూ ఉండిపోవడం కాకుండా..జీవితంలో మరింత విజయాలు సాధించడంపై కౌశల్ దృష్టిసారిస్తే మంచిదని ఓ నెటిజన్ సలహా ఇచ్చాడు.

error: Content is protected !!