నానబెట్టిన కిస్ మిస్ తింటున్నారా….ఈ 4 నిజాలు తెలుసుకోకపోతే….???

డ్రై ఫ్రూట్ లో కిస్ మిస్ గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కిస్ మిస్ లో చాలా పోషక విలువలు ఉంటాయి. అయినా చాలా మంది కిస్ మిస్ ని విస్మరిస్తారు.  కిస్ మిస్ రుచికి పుల్లగా, తియ్యగా ఉంటాయి. కిస్ మిస్ ని ఎక్కువగా స్వీట్స్ తయారీలో వాడుతూ ఉంటారు. కిస్ మిస్ వంటలకు మంచి  రుచిని అందిస్తుంది. కిస్ మిస్ ని కొంత మంది అలానే తినేస్తారు. కిస్ మిస్ ని ఏ విధంగా తిన్న అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కిస్ మిస్ ని  రాత్రి సమయంలో  నానబెట్టి మరుసటి రోజు ఉదయమే పరగడుపున తింటే ఎలాంటి ప్రయాజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం.

కిస్ మిస్ లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల రెగ్యులర్ గా  కిస్ మిస్ ని తీసుకుంటూ ఉంటే రక్తహీనత సమస్య రాదు. రక్త కణాల వృద్ధి జరుగుతుంది. విట‌మిన్ బి, పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. ఉదయాన్నే నానబెట్టిన కిస్ మిస్ తింటే రోజంతా ఉషారుగా ఉంటుంది. రక్తంలో చెడు కొలస్ట్రాల్ ని తొలగిస్తుంది. అంతేకాక అధిక బరువు ఉన్నవారు రెగ్యులర్ గా నానబెట్టిన కిస్ మిస్ ని తింటే చాలా ఉపయోగం ఉంటుంది. ఆకలిని ఎక్కువ చేసే లెప్టిన్‌ ని కిస్ మిస్ నియంత్రిస్తుంది. కాబట్టి డైటింగ్ చేసేవారు వీటిని తరచూ తీసుకుంటూ ఉంటే ఆహారాన్ని ఎక్కువ తీసుకోకుండా ఉండగలుగుతారు.

యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్క‌లంగానే ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేసి  ఫ్రీ ర్యాడిక‌ల్స్ నుంచి శ‌రీరానికి ర‌క్ష‌ణ‌గా నిలుస్తాయి. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతాయి.  వైర‌ల్ జ్వ‌రాలు, ఇన్‌ఫెక్ష‌న్ల‌తో బాధ ప‌డే వారు కిస్ మిస్ ని తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. గ్యాస్,అసిడిటీ, మలబద్దకం,కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. మలబద్దకంతో ఇబ్బంది పడేవారు  ప్రతిరోజూ  రాత్రి  పడుకునేముందు కిస్ మిస్ తోబాటు సోంపును కలిపి తీసుకుంటే మలబద్దకంనుంచి ఉపశమనం కలుగుతుంది. గొంతు నొప్పితో బాధపడేవారు నానబెట్టిన కిస్ మిస్ తింటే గొంతులో ఉన్న కఫము వంటివి తొలగిపోయి శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి.

పిల్లలకు నానబెట్టిన కిస్ మిస్ తినిపిస్తే ఆకలి పెరుగుతుంది. రెగ్యులర్ గా తింటే ఎంత ప‌నిచేసినా అంత త్వ‌ర‌గా అల‌సిపోరు. అలాగే రోజంతా ఉషారుగా ఉంటారు. ప్రతిరోజూ కిస్‌మిస్ పండ్లు తిన‌డం వ‌ల్ల మూత్రాశ‌యంలో అమ్మోనియా పెరగకుండా రాళ్ళు చేరకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.విటమిన్స్, అమినో యాసిడ్స్, మెగ్నీషియం, పోటాషియం అధికంగా ఉంటాయి. క్యాల్షియం పిల్లల్లో ఎముకల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లల పెరుగుదలకు, గర్భిణీలకు కిస్ మిస్ ఎంతగానో మేలు చేస్తాయి.రక్తంలో ఉండే యాసిడోసిస్ అనే టాక్సిన్.. చర్మ వ్యాధులకు కారణమవుతుంది. 

error: Content is protected !!