Health

రోజు గుడ్డు తింటున్నారా… ఈ 3 నిజాలు తెలుసుకోకపోతే నష్టపోతారు

ప్రతి రోజు ఒక గుడ్డు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. గుడ్డులో ప్రోటీన్స్,  కొవ్వులు,విటమిన్లు, ఖనిజాలు,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఒక యాపిల్ కన్నా రెండు రేట్లు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాపిల్ తింటే ఎంత శక్తి వస్తుందో అంతే శక్తి గుడ్డు తిన్నా వస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన మన శరీరానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేస్తాయి. చవకగా దొరికే గుడ్డులో గుడ్డు లో విటమిన్‌-సి, పీచు పదార్థం ఈ రెండూ తప్పించి మిగతా అన్ని పోషకాలూ, అన్ని విటమిన్లూ, ఖనిజాలూ ఉంటాయి. బరువు తగ్గాలని అనుకొనే వారికి గుడ్డు దివ్య ఔషధం అని చెప్పవచ్చు.

ఉడికించిన గుడ్డును తింటే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి త్వరగా ఆకలి వేయదు. దాంతో తీసుకొనే ఆహారం క్వాంటిటీ తగ్గుతుంది. దాంతో ఆటోమేటిక్ గా బరువు తగ్గుతారు. ప్రతి రోజు గుడ్డు తినటం అలవాటు చేసుకుంటే శరీరానికి అవసరమైన ప్రోటీన్స్,విటమిన్స్,పోషకాలు అందుతాయి. మనం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు అది జీర్ణం అయ్యి ఎంతో కొంత వ్యర్ధంగా బయటకు పోతుంది. అదే గుడ్డు అయితే ఎటువంటి వ్యర్ధాలు బయటకు పోకుండా 100 శాతం శరీరానికి అందుతుంది. గుడ్డులో అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. సుమారు 20 అమైనో ఆమ్లాలు కలిస్తే ప్రోటీన్ తయారవుతుంది. ఈ ప్రోటీన్స్ కండరాలు క్షీణించకుండా, హార్మోన్ల విడుదలకు, ఎంజైమ్‌ల తయారీకి అవసరం అవుతాయి. .

అలాగే గర్భిణీ స్త్రీలు,పాలు ఇచ్చే తల్లులు కూడా రోజు ఒక గుడ్డు తింటే మంచిది. చాలా మందికి గుడ్డు ఏ వయస్సు నుంచి తినవచ్చు అనే సందేహం ఉంటుంది. సాధారణంగా పిల్లలకు ఆరు నెలల నుంచి ఘనాహారం పెట్టటం ప్రారంభిస్తాం. కాబట్టి ఏడవ లేదా ఎనిమిదొవ నెల నుంచి ఉడికించిన పచ్చసొనను తినిపించవచ్చు. దీని వలన ఎటువంటి ఇబ్బందులు రావు. పిల్లలకు అవసరమైన పోషకాలు అందుతాయి. ఇక పిల్లలకు సంవత్సరం వచ్చేసరికి  పూర్తి గుడ్డును  మెత్తగా చేసి తినిపించొచ్చు.

నాటుకోడి గుడ్లు తింటే మంచిదా? లేదంటే ఫారం కోడి గుడ్లు తింటే మంచిదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఏ గుడ్డు లోనైనా పోషకాలు ఒకేలా ఉంటాయి. గుడ్డులో రైబోఫ్లావిన్‌ (విటమిన్‌ బి2) ఉండుట వలన  ఎదుగుదలకు, చర్మం ఆరోగ్యానికి, ఆహారం సరిగా జీర్ణం కావటానికి సహాయాపడుతుంది. గుడ్డులో ఉండే మినరల్స్ అలసటను దూరం చేస్తాయి.