ఇస్మార్ట్ శంక‌ర్ క‌థ ఇదే క‌దా?

పూరి గురి.. ఇస్మార్ట్ శంక‌ర్‌పైనే ఉంది. ఈ సినిమా హిట్టవ్వ‌క‌పోతే… పూరి కెరీర్‌పై తీవ్ర ప్ర‌భావం చూపించే ప్ర‌మాదం ఉంది. అందుకే పూరి కూడా అన్ని ర‌కాలుగా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. ఎప్పుడూ ఒకే ఫార్ములా క‌థ‌ల్ని ఎంచుకునే పూరి – ఈసారి కాస్త విభిన్నంగా ఆలోచించిన‌ట్టు తెలుస్తోంది. `ఇస్మార్ట్ శంక‌ర్‌` క‌థ‌.. ఈసారి కాస్త `బుర్ర‌` పెట్టి రాసిన‌ట్టే అనిపిస్తోంది. మెద‌ళ్ల మార్పిడి అనే పాయింట్ ప‌ట్టుకుని పూరి ఈ సినిమా తీశాడ‌ని స‌మాచారం.

అనుకోని ప‌రిస్థుల్లో ఓ పోలీస్ మెద‌డుని – ఓ కిల్ల‌ర్‌కి అతికించాల్సివ‌స్తుంది. పోలీస్ పాత్ర‌లో స‌త్య‌దేవ్ న‌టిస్తే… కిల్ల‌ర్‌గా రామ్ క‌నిపించ‌బోతున్నాడు. అలా మెద‌డు మారిపోవ‌డం వ‌ల్ల – జ‌రిగిన ప‌రిణామాలే ఈ సినిమా క‌థ‌. విశ్రాంతి ఘ‌ట్టం, ద్వితీయార్థంలోని స‌న్నివేశాలు, ప్రీ క్లైమాక్స్‌.. ఇవ‌న్నీ ఎవ‌రూ ఊహించ‌ని స్థాయిలో ఉంటాయ‌ని స‌మాచారం.

అందుకే పూరి, రామ్ ఈ సినిమాపై ముందు నుంచీ అంత న‌మ్మ‌కంతో ఉన్నారు. బుర్ర‌ల మార్పిడికి సంబంధించిన క్లూ కూడా ఇచ్చేశారు. రామ్ మెద‌డుల చిప్ పెట్టిన‌ట్టు ట్రైల‌ర్‌లో చూపించారు. అయితే స‌త్య‌దేవ్ బుర్ర రామ్‌కి అతికించ‌డం, స‌త్య‌దేవ్ జ్ఞాప‌కాల‌న్నీ రామ్‌ని వెంటాడ‌డ‌మే ఈ సినిమా క‌థ అని తెలుస్తోంది. నిజ‌మో కాదో తెలియాలంటే సినిమా విడుద‌ల అయ్యేంత వ‌ర‌కూ ఆగాలి.

error: Content is protected !!