మా నాన్న వలన నాకు రావలసిన గుర్తింపు రాలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన చరణ్

ప్రఖ్యాత సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యంకి సంగీతం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంగీతం, పాటల మీద ఉన్న ఇష్టంతో తన కొడుకుకి చరణ్ అని, తన కూతురికి పల్లవి అని పేర్లు పెట్టుకున్నాడు. తాజాగా ఆయన కొడుకు ఎస్పీ చరణ్ అలీతో సరదాగా ప్రోగ్రాంకి స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు . ఈ సందర్భంలో ఆయన ఎన్నో విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం కొడుకుగా మీకు రావలసిన పేరు వచ్చిందా అని అలీ అడగటంతో, చరణ్ మాట్లాడుతూ నేను ఎప్పుడు పాట పడిన బాలు గారి మాదిరి పాడారే, అంటారు తప్పితే నన్ను నన్నుగా ఎవరు గుర్తించలేదు.
అలా అని నేను ఎప్పుడు బాధపడలేదు. అలాంటి గొప్ప వ్యక్తితో పోలిచినందుకు సంతోషపడ్డాను.

నా వాయిస్ కూడా దాదాపుగా నాన్నగారి వాయిస్ లగే ఉంటుంది . దీనితో నేను పాడిన కొన్ని పాటలు కూడా నాన్నగారే పాడారని అనుకునేవాళ్లు. ఆయన పాడినదానిలో నేను 40 % పాడిన గొప్పగా పాడినట్లే అనుకోవాలి, ఆయన లాంటి మనిషిగా కొడుకుగా పుట్టటం నా అదృష్టం. నేను ఆయనకి చాలా రుణపడి ఉంటాను. ఇక ఆయన లాంటి సింగర్ మరొకరు రారనే నేను గట్టిగా చెపుతున్న ఇది అహంకారంతో చెపుతున్న మాటలు కాదు. ఆయన ఒక లెజెండ్ అంటూ తన తండ్రి గురించి చెప్పుకొచ్చాడు. అలాగే అలీతో తనకి ఉన్న అనుబంధాల గురించి, వర్షం మూవీతో అతను ఎదుర్కొన్న కష్టాల గురించి ఈ షో లో చెప్పుకొచ్చాడు.

error: Content is protected !!