జులై 12 తొలి ఏకాదశి రోజు ఈ తప్పులు చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీ కోసమే..

మనం సాధారణంగా ఏదైనా పని చేయాలంటే దశమి,ఏకాదశి కోసం ఎదురు చూస్తూ ఉంటాం.  ప్రతి నెలలో ఒక శుక్లపక్ష ఏకాదశి, ఒక కృష్ణపక్ష ఏకాదశి.. అంటే 2 ఏకాదశిలు వస్తాయి. అంటే సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. ఈ 24 ఏకాదశుల్లో ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు.మానవునికి భూమి మీద ఒక సంవత్సరం గడిచిందంటే దేవతలకు ఒక రోజు కింద లెక్క. దేవతలు 24 పక్షాలను 24 గంటలుగా పరిగణిస్తారు ఆలా చూస్తే రాత్రి మొదలు అయ్యే కాలం “ఆషాడ శుద్ధ ఏకాదశి”, ఈ రోజు శ్రీ మహా విష్ణువు యోగ నిద్రకి ఉపక్రమించే సమయం, అందువల్ల ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని పిలుస్తారు.

అంతేకాక ఈ ఏకాదశి నుండే పండుగలు కూడా ప్రారంభము అవుతాయి. అందువల్ల తొలి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష  చేస్తారు. .అసలు ఈ పండుగను ఎలా జరుపుకోవాలో చూద్దాం.

తొలి ఏకాదశి రోజున ఉదయమే తలస్నానము చేసి ఇంటిని శుభ్రం చేసుకొని విష్ణు మూర్తి పటాన్ని పువ్వులతో అలంకరించి ,మడితో శుచిగా చక్కెరపొంగళి ప్రసాదం చేసి నైవేద్యం పెట్టాలి. ఏకాదశి రోజు అబద్దం ఆడకూడదు. దుష్ట ఆలోచనలు చేయకూడదు.  ఏకాదశి రోజు ఉపవాసం ఉండి సాయంత్రం విష్ణువు ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. మర్నాడు అనగా ద్వాదశినాడు ఉదయాన్నే  శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి.ఈ విధంగా పూజ చేయడంవల్ల జన్మజన్మల పాపాలు తొలగి  పోయి ఆయురారోగ్యాలతో, అష్టాఐశ్వర్యలతో తులతూగుతారని, మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణంలో చెప్పబడింది. ఏకాదశి రోజు చేసే ఏ పనైనా మంచి ఫలితాన్ని, విజయాన్ని ఇస్తుందని శాస్త్రంలో చెప్పబడింది.

తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా పేలాల పిండిని తప్పనిసరిగా తినాలి. పేలాలు పితృదేవతలకు చాలా  ఇష్టమైనవి.. అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈ ఏకాదశి  రోజున  గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఒక కారణం ఉంది . బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు గురిఅవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలం.. కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఏకాదశి రోజున దేవాలయాల్లోనూ.. ఇళ్ల వద్దా పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు.

error: Content is protected !!