‘దిల్ రాజు’ పై అసూయ పడుతున్న అగ్ర నిర్మాతలు !

తెలుగు సినీ పరిశ్రమలో.. నేటి అగ్ర నిర్మాతగా ఈ తరం సినీ నిర్మాణ విభాగానికే సరైన గౌరవం విలువైన గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి, ఎవరైనా ఉన్నారా అంటే.. నిస్సందేహంగా ముందు చెప్పుకోవాల్సిన పేరు దిల్ రాజుదే. తన నిర్మాణ సంస్థే ఒక చిన్న సినీ పరిశ్రమ అన్న స్థాయిలో తరువాత తరం కూడా గుర్తుపెట్టుకోగలిగేంతగా పేరు ప్రఖ్యాతలు సంపాధించుకున్నాడు దిల్ రాజు. ‘తెలుగు సినిమా బాక్సాఫీస్’ ప్లాప్ ల్లో మునిగి కొట్టు మిట్టాడుతున్నపుడల్లా.. ఓ భారీ విజయంతో తెలుగు సినిమాకే ఊరటనిస్తున్నాడు ఈ బడా నిర్మాత. ఈ విజయ పరంపర ఒక్క దిల్ రాజుకే ఎలా సాధ్యం అవుతుందని మిగిలిన అగ్ర నిర్మాతలు అందరూ అసూయ పడుతున్నారట.

మొన్న ఈ మధ్య టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ అందరూ ఓ చోట కలుసుకున్నప్పుడు.. వారు ముచ్చటించుకున్న ప్రధాన ముచ్చట దిల్ రాజు గురించేనట. తెలుగు సినిమా ఎదుగుతునప్పటి నుండే.. మన నిర్మాణ సంస్థలు, మనము అగ్ర నిర్మాతలుగా ఓ వెలుగు వెలిగాము ఇప్పటికీ మనకు ఆ విలువ ఉంది. నేటికీ మనం తీసిన సినిమాలు ఇంకా క్లాసిక్ లుగానే గుర్తించబడుతున్నాయి గౌరవింపబడుతున్నాయి. పైగా నిర్మాణ రంగంలోనే మనకు అపారమైన అనుభవం ఉంది. అయినప్పటికీ.. ‘దిల్ రాజు’లా మనమెందుకు ఇప్పుడు వేగంగా సినిమాలు చేయలేకపోతున్నాము. అతనిలా సరైన కథలను ఎందుకు ఎంచుకోలేకపోతున్నాము. కొత్త టాలెంట్ ను అతను పట్టుకున్నట్లు మనమెందుకు పట్టుకోలేకపోతున్నాం అని.. అప్పటి ఇప్పటి అగ్ర నిర్మాతలందరూ దిల్ రాజు పై అసూయ పడుతూనే.. అతని ప్రతిభను మెచ్చుకున్నారట.

వాళ్ళ అసూయకి కూడా ఓ కారణం ఉంది. నిజానికి ఈ రోజుల్లో ఒక స్టార్ హీరోతో ఒక్క సినిమా తీసేందుకే సంవత్సరం లేదా రెండు సంవత్సరాల కాలం కూడా సరిపోని పరిస్థితి. అలాంటిది, ఒకే సంవత్సరంలో స్థార్ హీరోలతో రెండు మూడు సినిమాలు.. మీడియం రేంజ్ హీరోలతో మరో రెండు మూడు సినిమాలు తియ్యడం అంటే మాటలు కాదు, పైగా పక్క స్టార్ హీరోల సినిమాలను పంపిణి చేస్తూ.. ఈ రేంజ్ లో సినిమాలను నిర్మించడం ఒక్క దిల్ రాజుకే చెల్లింది. నిస్సందేహంగా తెలుగు సినీ పరిశ్రమల్లో గొప్ప నిర్మాతల వరుసలో దిల్ రాజుకి ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.

error: Content is protected !!