‘బేబీ’ కొత్త ఆలోచన ఏంటో తెలుసా!

‘ఓ బేబీ’తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన సమంత తదుపరి చిత్రం కోసం ఎలాంటి కాన్సెప్ట్‌ని ఎంచుకుంటుందా.? అనే ఆలోచనలు మొదలైపోయాయి. వరుసగా సమంతకు రీమేక్‌ సినిమాలు కలిసొస్తున్నాయి. ‘యూ టర్న్‌’ కన్నడ రీమేక్‌. తాజా చిత్రం ‘ఓ బేబీ’ కొరియన్‌ రీమేక్‌. ఇక ఇప్పుడు కూడా ఓ ఫ్రెంఛ్‌ మూవీ రీమేక్‌ దిశగా సమంత ఆలోచనలున్నాయనీ తెలుస్తోంది. అది కూడా హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీనే అట.

‘ఓ బేబీ’ తర్వాత సమంత ఇక సినిమాలు చేయకూడదనుకుందట. అలాంటి కథల్ని ఎంపిక చేసుకోవడం మళ్లీ సాధ్యమయ్యే పని కాదనే ఆలోచనతో సమంత అలా భావించిందట. కానీ ఎప్పటికప్పుడే కొత్త కొత్త కథలు పుట్టుకొస్తూనే ఉంటాయి. యంగ్‌ టాలెంట్స్‌ పుట్టుకొస్తూనే ఉన్నారు. కొంచెం దృష్టి పెడితే, ఆ కొత్త కథలన్నీ దృశ్యరూపం దాల్చేందుకు సిద్ధంగా ఉంటాయి. అలాంటి కథల్లో నటించేందుకు సమంత వంటి నటీనటుల అవసరం ఎప్పుడూ ఉంటుంది.

ఇక అసలు వివరాల్లోకి వెళితే, పెళ్లి తర్వాత సమంత ఎంచుకునే పాత్రలన్నీ ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. చర్చల్లో నిలుస్తున్నాయి. అలాంటి చర్చనీయాంశమైన పాత్రలోనే మళ్లీ సమంత నటించనుందట. ఆల్రెడీ ఓ రీమేక్‌ స్టోరీని సమంత లైన్‌లో పెట్టిందనీ తెలుస్తోంది. ఇదిలా ఉంటే, సమంతను లీడ్‌ రోల్‌లో పెట్టి, డిజిటల్‌ ప్లాట్‌ఫాం అయిన అమెజాన్‌ ప్రైమ్‌ వారు ఓ వెబ్‌సిరీస్‌ని రూపొందించాలనుకుంటున్నారట. సోషల్‌ మెసేజ్‌తో కూడిన ఈ వెబ్‌ సిరీస్‌ ముచ్చట్లు త్వరలోనే ప్రకటించనుందట సదరు డిజిటల్‌ సంస్థ.

error: Content is protected !!