జులై 16/17 చంద్ర గ్రహణం …పాటించాల్సిన నియమాలు… దోష నివారణ

శ్రీ వికారి నామ సంవత్సరంలో ఆషాఢమాసంలో జులై 16 న 149 ఏళ్ల తర్వాత ఆషాడ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్ర గ్రహణం ధనస్సు రాశిలో శని కేతు వక్రనడకలో ఏర్పడనున్నది. ఈ చంద్ర గ్రహణం భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ మినహా అన్ని ప్రాంతాలలోను కనువిందు చేయనున్నది. అంతేకాక చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈసంవత్సరంలో ఏర్పడే రెండో, చివరి చంద్రగ్రహణమని ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్పుతున్నారు.  సాధారణంగా చంద్రగ్రహణం అంటే చంద్రునికి సూర్యుడి మధ్య భూమి వస్తుంది. అప్పుడు చంద్రడు భూమి మీద ఉన్నవారికి కనిపించడు. ఈ గ్రహణాన్ని చంద్ర గ్రహణం అంటారు. సాధారణంగా గ్రహణ సమయంలో దేవాలయాలు మూసివేయటం  నదులు, సముద్రాలలో జపం, స్నానం వంటి పుణ్యకార్యాలు ఆచరించడం  వంటివి వింటూ ఉంటాం. గ్రహణం సమయంలో వాతావరణంలో ఎన్నో రకాల మార్పులు కలుగుతాయి.

అందువల్ల గర్భిణీస్త్రీలపై కిరణాలు పడకుండా ఉంటే మంచిదని,గర్భస్థ శిశువుకు ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ముందుచూపుతో పెద్దలు గ్రహణ సమయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదు. అలాగే అటు ఇటు కదలకుండా పడుకోవాలి. గ్రహణం చూడాలని అనిపిస్తే బయటకు వచ్చి చూడకుండా టివిలో చూడవచ్చు. పెద్దవారు ఏమి చెప్పిన మన మంచి కోసమే చెప్పుతారు. దానిలో తప్పఁకుండా పరమార్ధం ఉంటుంది.గ్రహణం అని తెలిసినప్పుడు దర్భలను ఇంటిలో వేసితరువాత పచ్చళ్ళమీద, ఆహారపద్ధారాల మీద వేస్తారు. ఇలా వేయటం వలన ఆహార పదార్ధాలు పాడవ్వవని నమ్మకం. గ్రహణ సమయంలో ఆహారం తీసుకుంటే ఆహారంజీర్ణం కాదు. వాతావరణ మార్పులే దీనికి కారణం. అందువల్ల గ్రహణ సమయానికి సమయానికి రెండు గంటలకు ముందే ఆహారాన్ని తీసుకోవాలని చెప్పుతారు. 

గ్రహణం పట్టు స్నానము, విడుపుస్నానము చెయ్యవలెను. ఆసమయంలో మంత్ర పునరశ్చరణ చేయుటవలన అధిక ఫలితాలు వస్తాయని పండితుల చెప్పుతున్నారు. చంద్ర గ్రహ ణం ఉత్తరాషాడ నక్షత్రంలో ఏర్పడటం వలన ఉత్తరాషాడ నక్షత్రంలో  ఉన్న ధనస్సు, మకర రాశులకు మంచిది కాదని పండితులు తెలుపుతున్నారు.అలాగే ఈ రాశులవారు చంద్రగ్రహణంను చూడకూడదు.  వీరు గ్రహణం పూర్తీ అయ్యాక తలంటు స్నానము చేసి ఇష్ట దైవాన్ని పూజించాలి. ఈ విధంగా చేస్తే ఉత్తరాషాడ నక్షత్రం.ధనస్సు రాశి,మకర రాశివారికి గ్రహణం కారణంగా చెడు ప్రభావం కలగదు. మేష రాశి ,కర్కాటక రాశి, సింహ రాశి,వృశ్చిక రాశి,మీన రాశుల వారికి శుభమని, తుల రాశి, కుంభ రాశుల వారికి మధ్యమంగా ఉంటుందని అంటున్నారు. 

జులై  16వ తేదీ అర్ధరాత్రి తర్వాత 12:12 గంటలకు చంద్రుడు భూమి ఉపచ్ఛాయలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో చందమామ చుట్టూ పలుచని నల్లటి పొర ఆవరించినట్టు కనిపిస్తుంది. చంద్రుడు 1:31 గంటల సమయంలో భూమి ప్రచ్ఛాయలోకి ప్రవేశించడంతో గ్రహణం ప్రారంభ మవుతుంది. ఉదయం 3 గంటల ప్రాం తంలో గరిష్ఠ గ్రహణం కనిపిస్తుంది. తర్వా త మెల్లిగా బయటికి రావడం ప్రారంభం అవుతుంది. ఉదయం 4:30 గంటలకు ప్రచ్ఛాయ నుంచి బయటకు రావడంతో గ్రహణం పూర్తవుతుంది. ఉదయం 5:49 గంటలకు చందమామ భూమి ఉపచ్ఛాయ నుంచి బయటికి వస్తుంది. అంటే చంద్రగ్రహణం రాత్రి 1.30నిమిషాలకు ప్రారంభమై 4.30 నిమిషాల వరకు కొనసాగనుంది.

మనః కారకుడు చంద్రుడు కాబట్టి మానసిక ఒత్తిడి లేకుండా మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే పరిహారం చేయాలి. ధనుస్సు రాశిలో గ్రహణం ఏర్పడుతుంది.. కాబట్టి ఆ రాశితోపాటు ఆ రాశికి ముందు వెనుక ఉండే వృశ్చికం, మకర రాశివారు జులై 17న శివుడికి అభిషేకం చేయిస్తే మంచిది. ఒకవేళ అభిషేకం చేయడం కుదరకపోతే ఓం నమశ్శివాయ మంత్రాన్ని 11 లేదా 108 సార్లు పఠిస్తే గ్రహణం ప్రభావం తగ్గుతుంది. అలాగే ఈ మంత్రాన్ని గ్రహణ సమయంలో పఠిస్తే వెయ్యి రేట్లు ఫలితం ఉంటుంది.

error: Content is protected !!