జులై 16 చంద్ర గ్రహణం నుండి కుభేరులు కాబోతున్న రాశులు…మీ రాశి ఉంటే అదృష్టవంతులే…!

జులై 16 న రాబోతున్న చంద్రగ్రహణం ఏ రాశులపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది. ఏ రాశుల వారు ఈ గ్రహణాన్ని చూడకూడదో వంటి విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. వికారి నామ సంవత్సరంలో ఆషాఢమాసంలో ఈ చంద్రగ్రహణం గురు పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కూడా కనపడటం వలన ఈ ప్రభావం కొన్ని  రాశులపై ఉంటుంది.

ముఖ్యంగా  ఉత్తరాషాఢ నక్షత్రం,ధనస్సు రాశి ,మకర రాశిలో జన్మించిన వారిపైన ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చంద్రగ్రహణం ఉత్తరాషాఢ నక్షత్రంలో ఏర్పడింది. గ్రహణ ప్రభావం అన్ని రాశుల వారిపై ఉన్నా కానీ ధనస్సు,మకర రాశి వారిపై కాస్త ఎక్కువగాఉంటుంది.  జులై 16 చంద్రగ్రహణం నుండి 4 రాశులవారికి అష్ట ఐశ్వర్యాలు కలగబోతున్నాయి. ఆ రాశుల వారు ఎవరో వివరంగా తెలుసుకుందాం. 

సింహరాశి

సింహరాశి వారు వారి జీవితంలో ఊహించని విధంగా ఉన్నతస్థితికి చేరుకుంటారు. వీరి స్థితి చూసి ఇతరులు ద్వేష భావంతో విమర్శలు చేయటానికి ప్రయత్నం చేస్తారు. కానీ వారే ఇబ్బందులకు గురి అవుతారు. ఈ రాశివారికి కోపం అనేది పెద్దగా రాదు. ఏఈ చంద్రగ్రహణం తర్వాత వీరి జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఈ గ్రహణం తర్వాత వీరుమానసికంగా,శరీరకముగా చాలా దృడంగా మారతారు. ఏ పరిస్థితి వచ్చిన తట్టుకొని నిలబడతారు. గ్రహణం ముందు పరిస్థితి ఒకలా ఉంటే గ్రహణం తర్వాత వీరి పరిస్థితి చాల మారిపోతుంది. చేయలేని పనులను కూడా చేయగలను అనే ధీమా కలుగుతుంది. ఈ రాశివారు నిర్ణయాలను చాలా చురుకుగా తీసుకోవటం వలన చాలా సమస్యల నుండి సక్సెస్ గా బయట పడతారు. వీరిలో ఉన్న అనవసర భయాలు అన్ని తొలగిపోయి చేసే ప్రతి పనిలోను కాన్ఫిడెన్స్ పెరిగి విజయం వెంట వెళతారు. అలాగే దైర్యంగా ఒక అడుగు ముందుకు వేయటానికి ప్రయత్నం చేస్తారు. వీరు వేసే ప్రతి అంచనా కరెక్ట్ అయ్యి చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది.  అర్ద్హికంగా మంచి స్థితిలో ఉంటారు. నలుగురికి సాయం చేసే స్థితిలోనే ఉంటారు. వీరు ఊహించని అనంత స్థితికి చేరుకుంటారు. 

తులా రాశి

తుల రాశివారికి ఇప్పటివరకు ఉన్న తెలియని ఆందోళనలు,భయాలు అన్ని తొలగిపోయి దైర్యంగా ఒక అడుగు ముందుకు వేయటం వలన జీవితం కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటివరకు ఎంత కష్టపడినా రాని ఫలితం ఈ చంద్ర గ్రహణం నుండి అందుకుంటారు. వీరు ఎంత తెలివైన ఆలోచనలు చేసిన ఇప్పటివరకు కాలం కల్సి రాక చాలాఇబ్బందులు,అవమానాలు పొందుతూ ఉంటారు. ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం నుండి ఆ ఇబ్బందులు,అవమానాలు అన్ని తొలగిపోయి హ్యాపీగా ఉంటారు. వీరి గ్రహ స్థితి కారణముగా వీరికి మంచే జరుగుతుంది. 

వీరు ఎంత నిజాయితీగా ఉంటారో ఎదుటివారు కూడా అంతే నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు. కానీ అది సాధ్యం కాదు కదా. అయినా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వీరు వేసే ప్రతి అడుగు బాగా అలోచించి వేస్తారు. ఈ చంద్రగ్రహణం తర్వాత వచ్చే మంచి అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నతస్థితికి వెళతారు. వీరు ఆర్ధికంగా చాలా బలంగా ఉంటారు. వీరికి కుటుంబం నుండి ఊహించని మద్దతు లభిస్తుంది. దాంతో చాలా ఆనందంగా ముందడుగు వేసి విజయాల బాట పడతారు. 

వృషభ రాశి

వృషభ రాశివారు ఈ చంద్రగ్రహణం నుండి వీరు ఊహించని చాలా లగ్జరీ జీవితాన్ని గడపబోతున్నారు. ఈ రాశివారు తమకు నచ్చినట్టుగానే ఉంటారు కానీ అసలు సర్దుబాటు కారు. ఒకరకంగా చెప్పాలంటే ఎక్కడ కాంప్రమైజ్ కారు. వారు చెప్పిందే వేదం అన్నట్టు వీరి ప్రవర్తన ఉంటుంది. వీరిలో దాగి ఉన్న నైపుణ్యాల కారణంగా ఉన్నతస్థితికిచేరుకుంటారు. వీరు ఏ రంగంలో ఉన్న సరే విజయవంతం అయ్యి ఒక శక్తివంతమైన వ్యక్తిగా ఎదుగుతారు. అలాగే పది మందికి ఉపాధి కలిగించి చేతనైన సాయాన్ని కూడా అందిస్తారు. 

వృషభ రాశివారు గతం గురించి ఆలోచన చేయకుండా వర్తమానం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. గతంలో జరిగిన ఓటమి,అవమానాల నుండి ఎన్నో పాఠాలను నేర్చుకుంటారు. దాంతో ఈ చంద్రగ్రహణం తరవాత వీరి అడుగులు అన్ని విజయం వైపే ఉండ బోతున్నాయి. ఈ రాశివారు ఏదైనా పని చేసినప్పుడు ఇతరుల ఆలోచన మీద కాకుండా సొంత ఆలోచనలను చేస్తే విజ్జయం సాధించటాన్ని ఎవరు ఆపలేరు. వీరి ఆలోచనకు అంత శక్తి ఉంది. ఈ రాశివారికి కుటుంబ సభ్యులమద్దతు కూడా సంపూర్ణంగా ఉండుట వలన చాలా ఆనందంగా ఉంటారు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశివారికి ఈ చంద్రగ్రహణం నుండి కుటుంబం మద్దతు ముఖ్యంగా జీవిత భాగస్వామి మద్దతు సంపూర్ణంగా ఉండుట వలన ఏదైనా సాదించగలను అనే ధీమా పెరుగుతుంది. వీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది. ఒకరకంగా చెప్పాలంటే వీరు ఎక్కడ అడుగు వేస్తె అక్కడ బంగారం అవుతుందంటే అతిశయోక్తి కాదేమో. రియల్ఎస్టేట్ వ్యాపారం చేసే వారికీ బాగా కలసివస్తుంది. ఉద్యోగంలో ఉన్నతస్థితికి వెళతారు. కొత్త కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఈ రాశివారు చాలా ఎక్కువగా కష్టపడతారు. 

అలాగే వృశ్చిక రాశివారికి భిన్నమైన ఆలోచనలు ఉంటాయి. వీరి చేతిలో అవసరానికి ఇబ్బంది లేకుండా ఎప్పుడు ధనం ఉంటుంది. దాంతో కాస్త కంఫర్ట్ గానే ఉంటారు.ఏదైనా పని తలపెట్టినప్పుడు అందరిలో బెస్ట్ గా ఉండాలని తాపత్రయపడతారు. అలాగే బెస్ట్ గా ఉంటారు. వీరు బయటకు కాస్త కఠినంగా కనపడిన లోపల మాత్రా మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. వీరి నిర్ణయాలు కాస్త కఠినంగా ఉంటాయి. గ్రహస్థితులు కారణంగా వీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది.

error: Content is protected !!