వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన ధీరులు

1. మిచెల్‌ స్టార్క్‌ – ఆసీస్ స్పీడ్ స్టార్ మిచెల్‌ స్టార్క్ ఈ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో అత్య‌ధిక వికెట్లు తీశాడు. 10 మ్యాచ్‌లో స్టార్క్ మొత్తం 27 వికెట్లు ప‌డ‌గొట్టి టాప్ ప్లేస్‌లో నిలిచాడు.
2. ఫెర్గూస‌న్‌ – కివీస్ త‌క్కువ స్కోర్లు చేసినా ఫైన‌ల్‌కు చేరిందంటే ప్ర‌ధాన కార‌ణం ఆ జ‌ట్టు బౌల‌ర్లే. ముఖ్యంగా ఫెర్గూస‌న్ 9 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీసి కీల‌క పాత్ర పోషించాడు. అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
3. జోఫ్రా ఆర్చ‌ర్‌ – గంట‌కు 150 కి.మీ వేగంతో బంతులు వేస్తూ.. ఇంగ్లండ్ పేస‌ర్ జోఫ్రా మొత్తం ప్రపంచం దృష్టిని ఆక‌ర్షించాడు. 11 మ్యాచ్‌ల్లో ఆర్చ‌ర్‌ 20 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ క‌ప్ గెల‌వ‌డంలో కీ రోల్ ప్లే చేశాడు.
4. ముస్తాఫిజూర్ ర‌హ్మ‌న్‌ – బంగ్లాదేశ్ విజ‌యాల్లో ముస్తాఫిజూర్ పాత్ర కూడా మ‌రువ‌లేనిది. అత‌ను కేవ‌లం 8 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీసి స‌త్తా చాటాడు. రహ్మాన్ డెత్ ఓవ‌ర్ల‌లోనే 14 వికెట్లు ప‌డ‌గొట్ట‌డం విశేషం.
5. జస్ప్రీత్ బుమ్రా -ప్రపంచ నెంబ‌ర వ‌న్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా ఈ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో స్థాయికి ద‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. మొత్తం 9 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు ప‌డగొట్టాడు. భార‌త్ త‌ర‌ఫున ప్ర‌పంచ‌క‌ప్‌లో జ‌హీర్ ఖాన్ (21) త‌రువాత అత్య‌ధిక వికెట్లు పడగొట్టిన బౌల‌ర్‌గా నిలిచాడు

error: Content is protected !!