నిద్ర లేకుండా ఎన్ని రాత్రులో..సాహో కోసం ప్రభాస్ అంత కష్ట పడ్డాడా..?

బాలీవుడ్‌లో సాహోను ప్రమోట్ చేస్తున్న ప్రభాస్.. ఓ ప్రమోషనల్ కార్యక్రమంలో ఈ విషయాలు వెల్లడించాడు.ఒకప్పుడు తాను ఎక్కడికెళ్లినా స్వేచ్చగా తిరిగొచ్చేవాడినని.. ఎవరూ గుర్తు పట్టకపోయేవారని అన్నాడు. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా మంచి ఇమేజ్ సంపాదించుకున్న రెబెల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు సాహోతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. సాహోపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఆ అంచనాలను అందుకునేందుకు సాహో టీమ్ కూడా చాలానే శ్రమించింది.

ముఖ్యంగా సినిమా కోసం ప్రభాస్ చాలా కష్టపడ్డాడు. ఎంతలా అంటే.. సినిమా కోసం ఏకంగా నిద్రలేని రాత్రులు గడిపాడట. దానికి కారణం ‘ఒత్తిడి’ అని చెప్పాడు.బాహుబలి సినిమాతో రాజమౌళి తనపై మరింత బాధ్యత మోపాడని.. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసమే సినిమాలు చేస్తే.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులను దృష్టిలో ఉంచుకుని సినిమా చేయాల్సి వస్తోందని అన్నాడు. ఆ ఒత్తిడితోనే సాహో సినిమా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పాడు.

బాలీవుడ్‌లో సాహోను ప్రమోట్ చేస్తున్న ప్రభాస్.. ఓ ప్రమోషనల్ కార్యక్రమంలో ఈ విషయాలు వెల్లడించాడు.ఒకప్పుడు తాను ఎక్కడికెళ్లినా స్వేచ్చగా తిరిగొచ్చేవాడినని.. ఎవరూ గుర్తు పట్టకపోయేవారని అన్నాడు. కానీ పరిస్థితి ఇప్పుడలా లేదని.. ఒకప్పుడు ముంబై ఎయిర్‌పోర్టులో ఒక అనామకుడిగా తిరిగిన తనను.. ఇప్పుడక్కడ దిగిపోగానే చాలామంది గుర్తుపడుతున్నారని అన్నాడు.ఇదంతా ఇప్పటికీ ఓ కల లాగే అనిపిస్తోందన్నాడు. సాహో కోసం రెండేళ్ల సమయం తీసుకున్న ప్రభాస్.. తనకు స్క్రిప్ట్ నచ్చితే..ఎన్ని రోజులైనా దాని కోసం వెచ్చించేందుకు వెనుకాడనని చెప్పాడు. నిజానికి ఏడాదిలోపే సాహోను పూర్తి చేయాలని భావించామని..కానీ భారీ యాక్షన్ సన్నివేశాల కారణంగా షూటింగ్ ఆలస్యమైందని తెలిపాడు. ఇకనుంచి సినిమాల సంఖ్యను పెంచుతానని చెప్పుకొచ్చాడు.

error: Content is protected !!