మహేష్ పాలిట నాగార్జున విలన్ అయ్యాడా..?

బాబా భాస్కర్-అలీ మధ్య జరుగుతున్నా వాదనలో మహేష్ ఎంట్రీ కావటం దగ్గర నుండి గొడవ స్టార్ట్ అయ్యింది . మహేష్ మధ్యలో మాట్లాడుతున్న సమయంలో నువ్వు ఇక్కడ పుల్లలు పెట్టవద్దు అంటూ అలీ మాట్లాడేసరికి వాదనలు స్టార్ట్ అయ్యాయి. దీనిపై తాజాగా మహేష్ అందరి ముందు మాట్లాడుతూ, నేను హౌస్ లో ఏమైనా మాట్లాడితే చాలు పుల్లలు పెట్టవద్దు అంటూ స్టేట్మెంట్ ఇస్తున్నారు. పుల్లలు పెట్టేవాడు అంటూ నాకు ముద్ర వేస్తున్నారు.

ఇక్కడ నుండి బయటకు వెళ్లిన తర్వాత అందరు నన్ను పుల్లలు పెట్టేవాడు అంటే బయట నా పరిస్థితి ఏమిటి, ఆ విషయం ఒక్కసారైనా ఆలోచించారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ మనం గమనిస్తే మొన్నటి వీక్ లో నాగార్జున మహేష్ కి ఈ పేరు పెట్టాడు. ఎక్కడ ఎప్పుడు ఏ అగ్గిపుల్ల ఎలిగిస్తాడో తెలియదంటూ నాగార్జున ఫన్నీ గా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరు కూడా దానినే పట్టుకొని సమయం వచ్చిన ప్రతిసారి కూడా అలా పిలుస్తున్నారు, అయితే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది.

అంతకుముందు జరిగిన ఒకటి అరా సంఘటనల ఆధారంగా ఒక్కో వీక్ వాళ్ళకి ఒక్కో పేరు ఇస్తారు తప్పితే వాళ్ళ క్యారెక్టర్ ని జడ్జి చేసి ఆ పేర్లు ఇవ్వరు.. సో హౌస్ మేట్స్ ఎవరైనా సరే ఆ పేర్లను, ఆ సంఘటనలని అప్పటి వరకే చూడాలి తప్పితే, ఆ తర్వాత జరిగే వాటికీ దానిని లింక్ చేస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదు. ఒక వారం ఆలీకి, రాహుల్ కి నాగ్ వార్నింగ్ ఇస్తాడు, ఆ తర్వాతి మెచ్చుకుంటాడు. హౌస్ లో వారం వారం మారిపోయే క్యారెక్టర్లు ఉన్నప్పుడు, పరిస్థితులకి తగ్గట్లు నడుచుకునే మనుషులు ఉన్నప్పుడు ఇలాంటి పెట్టుడు పేర్లు పట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టటం కరెక్ట్ కాదు

error: Content is protected !!