నిన్న ఎపిసోడ్ లో నాగార్జున చేసిన 3 తప్పులు ఇవే !

శనివారం బిగ్ బాస్ హౌస్ లో జరిగిన గొడవలను చాలా స్మూత్ గా పరిష్కారం చేసాడు నాగార్జున. ఎవరిని ఎక్కువ బాధపెట్టకుండా బాగా హ్యాండిల్ చేసాడు. అయితే శనివారం ఎపిసోడ్ లో నాగార్జున మూడు తప్పులు చేసినట్టుగా ప్రేక్షకులు భావిస్తున్నారు. మొదటగా అలీ,మహేష్ గొడవ పడుతున్నప్పుడు బాబా భాస్కర్ ఆపే ప్రయత్నం చేయలేదని అన్నారు. మహేష్ పుల్లలు పెడుతున్నాడని శ్రీముఖి ఇంటి సభ్యుల ముందు లేవనెత్తింది. మహేష్ మీద నెగిటివ్ అభిప్రాయం కలిగేలా శ్రీముఖి ప్రయత్నం చేసింది. అలీ,మహేష్ మధ్య గొడవకు కారణం శ్రీముఖి. అలాగే తరచుగా శ్రీముఖి ఇంటి సభ్యులను రెచ్చకొట్టటం గిరినుంచి అసలు నాగార్జున చర్చించలేదు. 

ఇక రెండోవది అలీకి ఏటిట్యూడ్ ఎక్కువ అని అహంకారం తగ్గించుకోమని నాగార్జున చెప్పాడు. అయితే హౌస్ లో ఏటిట్యూడ్,అహంకారం ఎక్కువగా ఉన్నది పునర్నవి. ఆమె ప్రవర్తన చాలా రోజుల నుంచి అలానే ఉంది. నాదే కరెక్ట్ మీరు చెప్పేది అంతా తప్పు అనే విధంగా బిహేవ్ ఉంటుంది. పునర్నవికి కూడా అలీకి ఇచ్చినట్టు వార్ణింగ్ ఇస్తే బాగుండేదని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. ఇక మూడోది పుల్లలు పెడుతున్నావని మహేష్ కి ట్యాగ్ ఇచ్చింది నాగార్జునే. ఆ మాటను పట్టుకొని హౌస్ సభ్యులు మహేష్ ని ఒక ఆట ఆడుకొనే ప్రయత్నం చేసారు. దీనిని నాగార్జున ప్రశించలేదు. సరదాగా అన్న మాటను సరదాగా తీసుకోవాలి కానీ సీరియస్ గా తీసుకోకూడదని నాగార్జున చెప్పలేదు. ఈ మూడు తప్పులు ఈ శనివారం నాగార్జున చేసాడు. 

error: Content is protected !!