సాహో ఎంత సాధించాలో తెలుసా ..? టార్గెట్ గట్టిగానే ఉంది

ప్రస్తుతం ఎక్కడ చూసిన సాహో పేరే వినిపించింది, టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ పరిశ్రమకి వెళ్లిన సాహో గురించే చర్చ. ప్రతి ఒక్కరి మదిలో సాహో ఆలోచనలే మెదులుతున్నాయి. ఇండియన్ స్క్రీన్ పై హాలీవుడ్ స్థాయి సినిమా తీయటం అంటే మాములు విషయం కాదు. దాదాపు 300 నుండి 350 కోట్లు ఈ సినిమాకి ఖర్చుపెట్టారు. దానికి తగ్గట్లే సినిమాని 320 కోట్లు దాక అమ్మటం జరిగింది. డిజిటల్,శాటిలైట్ రైట్స్ అన్ని కలిపి దాదాపు 430 కోట్లకి అమ్మేశారు.

ఈ సినిమా సేఫ్ వెంచర్ కావాలంటే దాదాపు 350 కోట్లు ధియోటర్స్ నుండి వసూళ్లు చేయాలి. అంటే టోటల్ గ్రాస్ 500 కోట్లు దాక వసూళ్లు చేస్తే సినిమాని తీసుకున్న బయ్యర్లు సేఫ్ అవుతారు. సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ వస్తే 500 కోట్లు పెద్ద విషయమేమి కాదు,1000 కోట్ల మార్క్ ని ఈజీ గా క్రాస్ చేస్తుంది. ఏమైనా తేడా కొడితే మాత్రం 500 కోట్లు కొంచం కష్టమైన టార్గెట్ అవుతుంది. కాబట్టి మొదటి రోజు వచ్చే టాక్ ప్రకారమే సినిమా వసూళ్లు ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు.

error: Content is protected !!