Health

‘ఆహారంలో వీటిని కలిపి తింటే మీ ప్రాణానికే ప్రమాదం’ వీటిని అస్సలు కలిపితినొద్దు.!

కొన్ని పదార్థాల మేళవింపు అజీర్తిని కలిగించి, పొట్టలో వాయువులు నిండుకునేలా చేసి, జీర్ణ వ్యవస్థను అస్తవ్యస్థం చేస్తుంది. కాబట్టి ఏ పదార్థాలను వేటితో జోడించి తినకూడదో తెలుసుకుని మసలుకోవాలి. జీర్ణశక్తి సన్నగిల్లితే శరీరంలో ఆమం(విషం) పేరుకుంటుంది. దీర్ఘకాలంపాటు అజీర్తికి గురయినప్పుడు ఈ విషాలు విపరీతంగా పెరిగిపోయి ఆ ప్రభావంతో శరీర జీవక్రియలు దెబ్బతింటాయి.

banana benefits in telugu

పాల ఉత్పత్తులు, జంతు సంబంధ ఆహారం: చేపలు, వెన్న కలిపి తినకూడదు. అలాగే గుడ్లు, పాలు కలిపి తీసుకోకూడదు.పాల ఉత్పత్తులు, ఉప్పు: చీజ్‌ ఆరోగ్యానికి మంచిదే! అయితే నిల్వ కోసం దానికి ఉప్పు చేరుస్తూ ఉంటారు.

ఇలా ఉప్పు ఉండడం వల్ల ఆ చీజ్‌ మనం తినే ఇతర పదార్థాలతో కలిసి విరుద్ధ ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఉప్పు చేర్చకుండా తయారుచేసిన చీజ్‌ ఎంచుకోవాలి.పళ్లు, ఇతర ఆహారం: భోజనం తిన్న వెంటనే పళ్లు తినడం సరి కాదు. ఇలా తినడం వల్ల జీర్ణాశయంలోకి చేరుకున్న పదార్థాలు పులిసిపోయే ప్రమాదం ఉంది.

కాబట్టి పళ్లు తిన్న రెండు గంటల తర్వాత భోజనం చేయాలి. లేదా భోజనం చేసిన రెండు గంటల తర్వాత పళ్లు తినాలి.వేడి, చల్లని పదార్థాలు: ఈ రెండింటినీ వెంటవెంటనే తీసుకోకూడదు. సాధారణంగా పొగలు కక్కే భోజనం ముగించిన వెంటనే చల్లని ఐస్‌క్రీమ్‌ తినేస్తూ ఉంటాం. ఇలా తినడం వల్ల జీర్ణాగ్ని చల్లారిపోయి జీర్ణక్రియ దెబ్బతింటుంది.