Devotional

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

సాధారణంగా పూజలు,వ్రతాలు చేసే సమయంలో ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే దారాల్ని చేతికి కడుతూ ఉంటారు. అలాగే దేవాలయాల్లో పూజలు చేసినప్పుడు కూడా పూజారులు ఈ దారాల్ని చేతికి కడుతూ ఉంటారు. ఈ దారాల్ని మౌళి అని అంటారు. అసలు ఈ దారాల్ని ఎందుకు కడతారో తెలుసా? దీని వెనక ఉన్న కారణం ఏమిటో తెలుసా? ఇప్పుడు దాని గురించి వివరంగా తెలుసుకుందాం. దీనికి సంబంధించి ఒక కథ ఉంది.

శ్రీమహా విష్ణువు వామన అవతారంలో ఉన్న సమయంలో బలి చక్రవర్తి వద్దకు వస్తాడు. అప్పుడు బలి చక్రవర్తి వామన అవతారంలో ఉన్న విష్ణువును వరం కోరుకోమని అంటాడు. అప్పుడు వామనుడు మూడు అడుగుల స్థలం కావాలని అడగగా సరే అని బలి అనడంతో, వామ‌నుడు ఒక అడుగును భూమిపై, మ‌రో అడుగుపై ఆకాశంపై పెడ‌తాడు. ఇక మూడో అడుగు ఎక్క‌డ పెట్టాలి అని వామ‌నుడు అడిగితే అప్పుడు బ‌లి ఏ మాత్రం సందేహించ‌కుండా త‌న నెత్తిన పెట్ట‌మంటాడు. దీంతో వామ‌నుడు త‌న కాలిని బ‌లి నెత్తిన పెట్ట‌గానే అత‌ను పాతాళంలోకి పోతాడు.

అప్పుడు మహా విష్ణువు బలి దాన గుణాన్ని మెచ్చుకొని మృత్యుంజ‌యుడిగా ఉండేలా వరం ఇస్తూ మౌళి అనే దారాన్ని క‌డ‌తాడ‌ట‌.అప్పటి నుంచి అందరు మౌళి దారాన్ని కట్టటం ప్రారంభించారు. ఇలా మౌళి దారాన్ని కడితే ఎటువంటి కీడు జరగదని నమ్మకం. అలాగే ఈ మౌళి దారం కట్టుకున్న వారి దరికి మృత్యువు కూడా చేరదట. గ్రహ దోషాలు పోవాలంటే ఈ దారాన్ని మగవారు కుడి చేతికి, ఆడవారు ఎడమ చేతికి కట్టుకుంటారు. అదే పెళ్లి కానీ అమ్మాయిలు కుడి చేతికి మౌళి దారాన్ని కడితే తొందరగా వివాహం అవుతుంది.