అసలేం జరిగింది.. కనబడని రోజా.. తెరపైకి సరికొత్త అనుమానాలు

సినీ కెరీర్‌లో ఎంత పాపులారిటీ సంపాదించిందో అంతకుమించిన పాపులారిటీ జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా సంపాదించింది రోజా. టెలివిజన్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయానికి తెరలేపిన ఈ షోలో రోజా జబర్దస్త్ నవ్వులే స్పెషల్ అట్రాక్షన్. జడ్జ్ స్థానంలో ఆమె కనిపించిందంటే చాలు స్కిట్స్ వేసే వారిలో అదో క్రేజ్. అలాంటి రోజా ఈ మధ్యకాలంలో జబర్దస్త్ ప్రోగ్రాంలో ఒక్కోసారి కనిపించక పోవడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి.ఒక దశలో రోజా లేనిదే ఈ జబర్దస్త్ షోకి ఇంత పాపులారిటీ లేదు అని టాక్ నడిచింది. అయితే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావిడి మొదలైందో అప్పటి నుంచి రోజాపై అనుమానాలు మొదలయ్యాయి.

ఈ ఎన్నికల్లో రోజా గెలిస్తే ఇక జబర్దస్త్ నుంచి ఆమె బయటకు వచ్చేస్తుందని బుల్లితెర ఆడియన్స్ బెంగ పడ్డారు.కానీ రోజా విషయంలో బుల్లితెర ఆడియన్స్ ఊహించిన దానికి భిన్నంగా జరిగింది. ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రోజా విజయం సాధించినప్పటికీ జబర్దస్త్ షోలో జడ్జ్ గా చేస్తూనే వస్తోంది. కాకపోతే అప్పుడప్పుడూ కొన్ని ఎపిసోడ్స్‌లో రోజా కనిపించకపోవడం అభిమానుల్లో కాసింత నిరుత్సాహాన్ని నింపుతోంది. తాజాగా అలాంటి ఓ పరిణామమే జరిగింది.కొన్నివారాలుగా జడ్జ్‌లుగా వస్తున్న రోజా, నాగబాబుల్లో ఈ వారం రోజా మిస్ అయింది. తాజాగా విడుదల చేసిన ప్రోమో వీడియోలో జడ్జ్ స్థానంలో నాగబాబు ఒక్కరే కనిపించడంతో షాక్ అవుతున్నారు ప్రేక్షకులు. రోజా కనిపించలేదంటే జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పిందా? ఏంటి.. అని అనుమాన పడుతున్నారు.

కానీ అసలు విషయం అది కాదట.ప్రస్తుతం రోజా రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండటం కారణం గానే కాస్త గ్యాప్ తీసుకుందట. అందుకే నాగబాబు సోలోగా జబర్దస్త్ జడ్జ్ సీట్లో కనిపించారని అంటున్నారు. అయితే రోజా మిస్సింగ్‌ను వరుణ్ తేజ్, హరీష్ శంకర్‌తో కవర్ చేయడం విశేషం. సెప్టెంబర్ 20న ప్రసారం కాబోయే ఈ ఎపిసోడ్‌లో వాల్మీకి టీం వస్తున్నారు.అంటే ఈ ఎపిసోడ్ లో మెగా తండ్రి కొడుకులు కితకితలు పెట్టనున్నారన్నమాట. కంటిస్టెంట్స్ స్కిట్స్ నడుమ మెగా బ్రదర్ నాగబాబు, ఆయన తనయుడు వరుణ్ తేజ్ సందడి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కానుంది. దీంతో ఈ ప్రోమో వీడియో వైరల్ కావడం, ఎపిసోడ్ పై ఆసక్తి రేకెత్తడం రెండూ ఒకేసారి జరిగాయి.

ఇటీవలి ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రోజా విజయం సాధించడంతో ఆమె జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పేయనుందని వార్తలు గుప్పుమంటున్నాయి. కానీ రోజా సందడి మాత్రం ఆగడం లేదు. అప్పుడప్పుడూ కొన్ని ఎపిసోడ్స్ మినహాయిస్తే ఎక్కువగా రోజా నవ్వులు నాట్యమాడుతూనే ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే జబర్దస్త్ ప్రోగ్రాం రోజా అస్సలు వదలదని అర్థమవుతోంది.

error: Content is protected !!