టీడీపీ పగ్గాలు లోకేష్ చేతికా… ఎన్టీఆర్ చేతికా…?

ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ ఎంతటి దారుణమైన ఓటమిని కూడగట్టుకుందో మనందరికీ తెలిసిందే. అయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ ఆలా దారుణంగా ఓడిపోవడానికి కారణం పార్టీ అధినాయకత్వం అని చాలా మంది నాయకులు చెబుతున్నారు. అయితే త్వరలోనే పార్టీ నాయకత్వాన్ని వేరేవారి చేతిలో పెట్టాలని, లేకపోతె టీడీపీ కి భవిష్యత్తు ఉండదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల తరువాత నిర్ణయించుకున్నాడు. కాగా తన తరువాత తన బాధ్యతలను ఎవరికి అప్పగిస్తే బాగుంటుందని వచ్చిన చర్చలో మాత్రం, ఎన్టీఆర్ ఒక్కడే ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలదని పలువురు సీనియర్ నేతలు సూచించారు.

కానీ ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు అప్పగించడం అనేది అటు నందమూరి కుటుంబానికి మరియు నారా వారి కుటుంబానికి ఎంత మాత్రం ఇష్టం లేదనేది వాస్తవం. అందుకని ఆలా పార్టీని వేరెవరికో అప్పగించడానికి కూడా చంద్రబాబు ఇష్టపడటం లేదు. కాగా ఇటీవలే బాలయ్య అల్లుళ్ళు లోకేష్, శ్రీభరత్ ఇద్దరు కూడా ఎన్టీఆర్ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అంటే ఎన్టీఆర్ కి బాధ్యతలు అప్పగించడం ఇష్టం లేదని తెలుస్తుంది. కానీ టీడీపీ పార్టీ ఇటీవల తలపెట్టినటువంటి పల్నాడు ఉద్యమంలో కూడా నారా లోకేష్ చాలా విచిత్రమైన ధోరణిని కనబరిచాడు. అందుకనే లోకేష్ కి పార్టీ బాధ్యతలు అప్పగించాలనే ఆశ వదులుకోవాలని చంద్రబాబు కి సూచించారు. అంటే ఇక టీడీపీ కి ఎన్టీఆర్ ఒక్కడే దిక్కని అర్థమవుతుంది. కానీ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి…

error: Content is protected !!