బతుకమ్మ బ్రాండ్ తో కొత్త చీరలు – పంపిణి ఎప్పుడంటే…?

తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో జరుపుకునే అతి పెద్ద పండగ దసరా. మరొక పది రోజుల్లో దసరా పండగకి సంబందించిన ఆటలు ప్రారంభం అవుతాయి కూడా. కాగా గతంలో లాగే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మహిళలందరికీ కూడా బతుకమ్మ చీరలను పంచే కార్యక్రమాన్ని ఈసారి కూడా ప్రారంభించనుంది. దానితో పాటే ఎన్నో కోట్లు వెచ్చించి బతుకమ్మ పండుగను కన్నుల పండుగ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలోనే ఈ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ IT శాఖా మంత్రి కేటీఆర్.

కాగా ఆతరువాత ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ బతుకమ్మ చీరల విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాగా వచ్చే ఏడాది నుంచి బతుకమ్మ అనే బ్రాండ్స్ తో మార్కెట్లోకి చీరలు తీసుకొస్తామని, ఎప్పటిలాగే మహిళలందరికీ కూడా మంచి క్వాలిటీతో చీరలను అందిస్తామని కేటీఆర్ తెలిపారు. కాగా ఈ ఏడాదికి అందించవలసిన చీరలు మాత్రం ఈనెల 23 నుండి పంపిణి చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

error: Content is protected !!