పూజా ఎంట్రీతో అయినా అఖిల్ రాత మారేనా?

పూజాహెగ్డే.. ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ బెంగుళూరు బ్యూటీకి ఆ సినిమా బ్రేక్ ఇవ్వలేదు. వరుణ్ తేజ్‌తో నటించిన ముకుంద కూడా సో..సో గా ఆడింది. ఆ తరువాత ఏకంగా బాలీవుడ్ నుండి బడా ఆఫర్ దక్కడంతో ముంబై చెక్కేసింది. ఎన్నో ఆశలతో హ్రితిక్‌తో కలిసి చేసిన ‘మొహెంజోదారో’ కూడా డిజాస్టర్ అయ్యింది. దాంతో ఆఫర్స్ ఎదురుచూస్తున్న టైమ్‌లో ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ పిలిచి మరీ DJ లో హీరోయిన్‌గా ఆఫర్ ఇచ్చాడు. ఆ సినిమాలో ఆమె టాలెంట్ చూపించే అవకాశం లేకపోయినా కూడా చూపించాల్సినవన్నీ చూపించింది. దాంతో వరుసగా ఆఫర్స్ వెల్లువెత్తాయి.

DJ కమర్షియల్ సక్సెస్‌తో పూజా కూడా కమర్షియల్‌గా కాస్త రేటు పెంచింది. అయినా కూడా యూత్‌లో ఆమెకి ఉన్న క్రేజ్ వల్ల ప్రొడ్యూసర్స్ కూడా అడిగినంత ఇచ్చి మరీ సినిమాలు చేయించుకున్నారు. రంగస్థలం సినిమాలో ఒక్క పాట చేసినా కూడా ఆమెకి దక్కాల్సిన క్రెడిట్ దక్కింది. ఆ సినిమా సక్సెస్‌లో కూడా ఆమెకి దక్కాల్సిన వాటా వచ్చింది. మధ్యలో సాక్ష్యం సినిమా ఒకటే ప్లాప్ అనిపించుకుంది. ఆ సినిమాలో ఆమె లుక్‌పై కూడా కామెంట్స్ వచ్చాయి. కానీ ఆ తరువాత అరవింద సమేత సినిమాతో కూడా మరొక హిట్ అందుకుంది. పైగా ఆ సినిమాలో ఆమెకి మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ రాసాడు త్రివిక్రమ్. మహేష్ బాబు 25వ సినిమా మహర్షిలో కూడా పూజానే హీరోయిన్. ఆ సినిమా కూడా 100 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టడంతో ఆమె గోల్డెన్ లెగ్ ఇమేజ్ కంటిన్యూ అవుతుంది. ఇక రీసెంట్‌గా గద్దలకొండ గణేష్ సినిమాలో కూడా ఆమెకి మంచి పాత్ర దక్కింది. ఆ సినిమా క్రెడిట్‌లో కూడా ఆమెకి దక్కాల్సిన షేర్ దక్కింది.

సంక్రాంతికి రాబోతున్న అల..వైకుంఠపురములో సినిమాలో కూడా ఆమె హీరోయిన్. అయితే అలా టాప్‌లీగ్‌లో కంటిన్యూ అవుతున్న ఆమెకి అన్ని ఏజ్‌గ్రూప్‌ల హీరోలనుండి ఆఫర్స్ అందుతున్నాయి. రీసెంట్‌గా అఖిల్ గీత ఆర్ట్స్‌లో తన నాలుగో సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి కూడా చాలామంది హీరోయిన్స్‌ని అనుకుని ఫైనల్‌గా మళ్ళీ పూజాకే ఫిక్స్ అయ్యారు. అది మీడియం బడ్జెట్ సినిమా అయినా కూడా మళ్ళీ కోటికి పైగా రెమ్యునరేషన్ ఇచ్చి ఆమెని తీసుకున్నారు అంటే ఆమె హవా ఎలా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు.

అయితే అఖిల్ ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా కొట్టలేపోయాడు. మరి పూజా వల్ల అయినా అఖిల్ రాత మారి హిట్ వస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో చైతూ‌తో ఆమె చేసిన ఒక లైలా కోసం ఫెయిల్ అయినా కూడా అది ఫస్ట్ ఇన్నింగ్స్. మరి తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇప్పటికే మెగా హీరోలకి, నందమూరి హీరోలకి లక్కీ ఛార్మ్‌గా మారిన పూజా, అక్కినేని కాంపౌండ్‌కి కూడా హిట్ అందిస్తే మరో రెండు మూడేళ్లు వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. ఆమె అఖిల్ తో సెట్స్‌లో అడుగు పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

error: Content is protected !!