నాని విషయంలో జరిగింది చూశాక బిగ్ బాస్ హోస్ట్ గా వద్దనుకున్నా

మంచు వారి అమ్మాయి లక్ష్మీ మంచు నిర్మాతగా, నటిగా, టీవీ హోస్ట్ గా అందరికి సుపరిచితురాలు. అమెరికన్ యాక్సెంట్ తో ఆమె మాట్లాడే తెలుగుకి చాలా మంది అభిమానులు ఉన్నారు. గతంలో అమెరికాలో కొన్ని షోస్ నిర్వహించిన లక్ష్మీ తెలుగులో మొదటిసారిగా లక్ష్మీ టాక్ షో తో కనిపించారు. ఆ తరువాత లక్కుంటే లక్ష్మీ, వంటి షోలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె మేము సైతం, మహారాణి వంటి షోలలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఆమె డిజిటల్ ప్లాట్ ఫార్మ్ అయిన వూట్ సంస్థ కొరకు ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ పేరుతో ఓ రియాలిటీ షో నిర్వహించనున్నారు. కాగా మరి ఇంతటి సక్సెస్ఫుల్ వ్యాఖ్యాత అయిన ఆమె బిగ్ బాస్ హోస్ట్ గా ఎందుకు చేయరు అని అడుగగా ఆమె ఆసక్తికర సమాధానం చెప్పారు. బిగ్ బాస్ రెండవ సీజన్ హోస్ట్ గా చేసిన నాని ఎంతో చక్కగా షో నిర్వహించినప్పటికీ చాలా మంది ఆయనను విమర్శించడం జరిగింది. అలాంటి విమర్శలు చూసిన నేను, అలాంటి నెగెటివిటీ పేస్ చేయడం నావల్ల కాదని, అందుకే బిగ్ బాస్ హోస్టింగ్ చేయకూడని నిర్ణయించుకున్నాను అన్నారు.

error: Content is protected !!