లేటెస్ట్ అప్డేట్ : సైరా లో చిరు డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారా…?

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం “సైరా”… ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి మొట్టమొదటి స్వాతంత్ర్య ఉద్యమకారుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో కనిపించనున్నారు. కాగా భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. కాగా నయనతార ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. అయితే మరికొందరు ప్రముఖులు కూడా ఈ చిత్రంలో కొన్ని కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. కాగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

అయితే విడుదలకి సిద్దమైన ఈ చిత్రానికి సంబందించిన ఒక లేటెస్ట్ వార్త ప్రస్తుతానికి వైరల్ గా మారిందని చెప్పాలి. అదేంటో కాదు ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి రెండు పాత్రల్లో కనిపించనున్నారంట. అంటే ఒక పాత్రలో చిరంజీవి చనిపోగా, మరొక పాత్ర బ్రతికే ఉంటుందని సమాచారం. అయితే చనిపోయిన చిరంజీవి పోరాటాన్ని, బ్రతికున్న చిరంజీవి సాగిస్తాడని సమాచారం. కనై ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉన్నది అనేది మాత్రం స్ఫష్టత రావాల్సి ఉంది. కాగా చిరంజీవి ఇప్పటికే చాలా సినిమాల్లో ద్విపాత్రాభినయం లో కనిపించి అభిమానులందరినీ అలరించాడు. కాగా ఈ చిత్రంలోకూడా చిరు డ్యూయల్ రోల్ లో కనిపిస్తే ఇక అభిమానులందరికి కూడా పండగే అని చెప్పాలి. కానీ విషయం మీద అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

error: Content is protected !!