Bathukamma Day 2: రెండోరోజు ‘అటుకుల బతుకమ్మ’.. వాయనంగా అటుకులు

బతుకమ్మ పండుగలో భాగంగా రెండో రోజు అటుకుల బతుకమ్మ’ను పూజిస్తారు. ఇందుకుగాను ఉదయాన్నే అడవికి వెళ్లి తంగేడు , గునుగు, బంతి, చామంతి, అడవి గడ్డి పూలు తీసుకువస్తారు. ఈ పూలను రెండు ఎత్తులలో గౌరమ్మను పేర్చి, ఆడవారు అందరూ కలసి ఆడుకొని సాయంత్రం చెరువులలో నిమజ్జనం చేస్తారు. ఈ రోజు అటుకులను వాయనంగా ఇస్తారు.

బతుకమ్మ పండుగ జరిగే 9 రోజులు 9 రూపాల్లో బతుకమ్మను తయారుచేసి, పాటలు పాడుతూ భక్తిశ్రద్ధలతో ‘బతుకమ్మ’ పండుగను తెలంగాణ వ్యాప్తంగా పిల్లాపెద్ద ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. వీటిలో చివరిదైన సద్దుల బతుకమ్మ పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది..

error: Content is protected !!