సైరా కోసం తమన్నా, నయన్ లు తీసుకున్నదెంతో తెలుసా..?

సైరా కోసం అమితాబ్ బ‌చ్చ‌న్‌, అనుష్క పారితోషికాలు తీసుకోకుండానే న‌టించార‌ని చిరంజీవి బ‌హిరంగంగానే చెప్పారు. చిరుపై అభిమానంతోనే వాళ్లిద్ద‌రూ ఈ సినిమా కోసం ఫ్రీగా న‌టించారు. అయితే న‌య‌న‌తార‌, త‌మ‌న్నాల‌కు మాత్రం సైరా బృందం భారీ పారితోషికాలే అందించిన‌ట్టు స‌మాచారం. ఈ చిత్రంలో త‌మ‌న్నా, న‌య‌న‌లు క‌థానాయిక‌లుగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. న‌య‌న కంటే త‌మ‌న్నా పాత్ర‌కే అధిక ప్రాధాన్యం ఉంది. అయితే… న‌య‌న‌కే ఎక్కువ పారితోషికం అందిన‌ట్టు తెలుస్తోంది.

ఈ సినిమా కోసం న‌య‌న‌కు 3 కోట్ల పారితోషికం ఇచ్చిన‌ట్టు స‌మాచారం. మొత్తంగా త‌ను కేవ‌లం 15 రోజుల కాల్షీట్లే ఇచ్చిన‌ట్టు స‌మాచారం. త‌మ‌న్నాకు 1.5 కోట్ల పారితోషికం అందించార్ట‌. త‌ను మాత్రం దాదాపుగా 25 రోజుల కాల్షీట్లు కేటాయించింద‌ట‌. అంతేకాదు.. సైరా ప్ర‌మోష‌న్ల‌లో సైతం విరివిగా పాల్గొంది. మొత్తంగా చూస్తే… ఈ ఇద్ద‌రి పారితోషికాలే 5 కోట్ల వ‌ర‌కూ లెక్క తేలాయి. ఈ చిత్రంలో చిన్న చిన్న పాత్ర‌ల‌లో క‌నిపించిన జ‌గ‌ప‌తిబాబు, విజ‌య్‌సేతుప‌తి, సుదీప్‌కీ కూడా భారీ పారితోషికాలే అందాయ‌ని స‌మాచారం.

error: Content is protected !!