ప్రమోషన్లకు రాకపోవడానికి అసలు కారణం ఇదే..? బయటపెట్టిన నయనతార

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. అయితే.. అందరికి మించిన ఇమేజ్ నయన్ సొంతం. ఏదైనా సినిమాకు నయన్ ఓకే చెప్పాలంటే దానికి బోలెడన్ని కండీషన్లు పెడుతుందని చెబుతారు. మిగిలిన కండీషన్ల సంగతి ఎలా ఉన్నా.. సినిమాకు సంబంధించిన ఏ ప్రమోషన్ కార్యక్రమానికి తాను హాజరు కానని తెగేసి చెబుతారని చెబుతారు. అంతేకాదు.. సినిమా రిలీజ్ కు ముందు నిర్వహించే మీడియా మీట్ కు సైతం ఆమె రారు.అంతేనా.. సినిమా విడుదల సమయంలో ప్రత్యేక ఇంటర్వ్యూలలో కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చే ఎక్స్ క్లూజివ్ లు వేటికి నయన్ ఎస్ చెప్పరు.

ఎందుకిలా? అంటే.. ఆమె అంతే అని కొందరు… ఆమె పాలసీ అంతేనని మరికొందరు చెబుతుంటారు. కొన్ని సంవత్సరాలుగా ఒకే పాలసీని ఫాలో అవుతున్న నయన్ మీద ఈ మధ్యన విమర్శలు అంతకంతకూ పెరుగుతున్నాయి.భారీ బడ్జెట్ తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సైరా మూవీ ప్రమోషన్లకు సైతం నయన్ డుమ్మా కొట్టటం హాట్ టాపిక్ గా మారింది. మిగిలిన సినిమాల సంగతి వేరు.. ఒక భారీ బడ్జెట్ సినిమాకు ప్రమోషన్ బాధ్యత ఉండదా? అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా తన ప్రియుడు విఘ్నేశ్ శివన్ నిర్మాతగా వ్యవహరిస్తూ తీస్తున్న నెట్రికన్ ప్రారంభోత్సవానికి కూడా నయన్ రాకపోవటం తాజాగా హాట్ టాపిక్ అయ్యింది.బయటోళ్ల సినిమాల సంగతి సరే.. సొంతోళ్ల సినిమాల విషయంలోనూ ఇదే పద్దతా? అన్న విమర్శ నయన్ వరకూ వెళ్లిందట. దీంతో.. తాను ప్రమోషన్లలో పాల్గొనకపోవటానికి కారణం.. తాను పెట్టుకున్న పాలసీ కాదని.. తాను ప్రమోషన్లకు హాజరైన సినిమా ఫలితం తేడా కొట్టటంతో.. తాను దూరంగా ఉంటానని.. అదంతా తన సెంటిమెంట్ అని చెప్పి సన్నిహితుల వద్ద తన బాధను వెళ్లగక్కిందట.

నయనతారలో సెంటిమెంట్ల యాంగిల్ కూడా ఉంటుందా? అంటూ పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇంతకాలం ప్రమోషన్లకు దూరంగా ఉండే అంశానికి సంబంధించి నయనతార మీద వినిపించే కామెంట్లు.. సెంటిమెంట్ విషయం బయటకు వచ్చిన నేపథ్యంలో అయినా తగ్గుతాయేమో చూడాలి.

error: Content is protected !!