రాహుల్,వరుణ్ లకు ఓటేసి, మహేష్ ని ఇంటికి పంపండి-పునర్నవి

బిగ్ బాస్ నుండి బయటకొచ్చినా పునర్నవి రాహుల్ పై అభిమానం కొనసాగిస్తుంది. రాహుల్ కి ఓటేసి ఆయన షోలో కొనసాగేలా చూడాలని ప్రేక్షకులను కోరుకుంటుంది. సోషల్ మీడియా వేదికగా రాహుల్ మరియు వరుణ్ లకు ఓటు వేయాలని విన్నపం చేస్తుంది. పునర్నవి భూపాళం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగారు. ఐతే గతవారం ఆమె ఎలిమినేట్ కాబడి షో వీడటం జరిగింది. కాగా ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్స్ లో ముగ్గురు వున్నారు.

వరుణ్, రాహుల్, మహేష్ విట్టా ముగ్గురిలో ఒకరు షో నుండి ఎలిమినేట్ కానున్నారు. ఇక రానున్న రోజులలో ఎలిమినేషన్ కఠిన తరం కానున్న నేపథ్యంలో రాహుల్ మరియు వరుణ్ లకు ఓటు వేయాలని పునర్నవి ఒక వీడియో ద్వారా తెలియజేశారు. ఐతే మహేష్ విట్టా కూడా ఎలిమినేషన్ లో ఉండగా పునర్నవి అతనికి సపోర్ట్ చేయడకపోడం గమనార్హం. ఆమె పరోక్షంగా రాహుల్, వరుణ్ లను గెలిపించి, మహేష్ ని ఇంటికి పంపండి అని చెప్పినట్లైంది.

error: Content is protected !!