బిగ్ బాస్ : ఈ ఇద్దరిలో మొదట సేవ్ అయ్యేది ఇతనే..!?

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ సిప్లిగంజ్,వరుణ్ సందేశ్ మరియు మహేష్ విట్టాలు ఎలిమినేషన్ జోన్ లో ఉన్న సంగతి తెలిసిందే.అయితే సోషల్ మీడియా మరియు బిగ్ ఫాలోవర్స్ మాత్రం మహేష్ కంటే రాహుల్ మరియు వరుణ్ ల మీదనే ఎక్కువ దృష్టి పడింది.అంతే కాకుండా ఇటీవలే బయటకు వచ్చేసిన పునర్నవి కూడా ఈ ఇద్దరికే తన మద్దతు తెలుపుతూ ఇద్దరినీ సేవ్ చేసుకోవాలని వారి ఫాలోవర్స్ కి చెప్పుకొచ్చింది.

అయితే మొత్తం ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న విషయాన్ని పక్కన పెడితే రాహుల్ మరియు వరుణ్ ల ప్రస్తావన వచ్చినపుడు మాత్రం పక్కాగా ఇద్దరిలో ఈ కంటెస్టెంట్ ముందుగా సేవ్ అయ్యిపోతాడు అని బిగ్ బాస్ షో ఫాలోవర్స్ చాలా నమ్మకంగా చెప్తున్నారు.అతను ఇంకెవరో కాదు వరుణ్ సందేశే.ఇప్పటి దాకా కూడా వరుణ్ చాలా జెన్యూన్ గా ఆడుతూ వస్తున్నాడని అందువల్ల ఆన్లైన్ వోటింగ్ ఒక్కటే కాకుండా కాల్స్ వోటింగ్ కూడా వరుణ్ కు ఎక్కువగా ఉందని అందుకే ఖచ్చితంగా వరుణే ముందు సేఫ్ అయ్యిపోతాడని ఈ షోను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారు అంటున్నారు.మరి వీరి నమ్మకానికి తగ్గటుగా ముందు ఎవరు సేఫ్ జోన్ లోకి వెళ్తారో చూడాలంటే కాస్త ఆగాల్సిందే.

error: Content is protected !!