రాహుల్,వరుణ్ ల కోసం పునర్నవి ఏం చేస్తుందో చూడండి..?

బిగ్ బాస్ తెలుగు మూడవ సీజన్ చివరికి చేరుకుంటుండడంతో మరింత రసవత్తరంగా మారుతుంది.గత వారం బిగ్ బాస్ హౌస్ నుంచి పునర్నవి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే.అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నపుడు పునర్నవికి మరియు రాహుల్ కు మధ్య ఉన్న కెమిస్ట్రీ కోసం స్పెషల్ గా చెప్పక్కర్లేదు.ఇప్పటికే ఎన్నో ఎపిసోడ్స్ లో చూసేసాం అయితే పునర్నవి బయటకు వచ్చేసాక రాహుల్ పడ్డ బాధను కూడా ఎవరూ ఆపలేకపోయారు.

అయితే పునర్నవి మాత్రం బయటకు వచ్చాక రాహుల్ మీద ఉన్న ఇష్టాన్ని మరోసారి బయట పెట్టుకుంది.ప్రస్తుతం ఎలిమినేషన్ జోన్ లో రాహుల్ మరియు వరుణ్,మహేష్ విట్టా లు ఉన్న స్నాగతి అందరికి తెలిసిందే.ఈ ఎలిమినేషన్ కు సంబంధించి రాహుల్ మరియు వరుణ్ ల కోసం ప్రమోషన్ చెయ్యడం మొదలు పెట్టింది.దీనికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఇప్పుడు రాహుల్ మరియు వరుణ్ కు బిగ్ బాస్ వీక్షకుల సపోర్ట్ చాలా అవసరం అని అందుకే ఇప్పుడు ఈ ఇద్దరు ముఖ్యమైన కంటెస్టెంట్స్ నామినేషన్ లో ఉన్నారు కాబట్టి వారిని సేవ్ చెయ్యాలని పిలుపు ఇచ్చింది.అంతే కాకుండా ఇప్పటి నుంచి ఈ నామినేషన్ అనేది చాలా టఫ్ అయ్యిపోతుందని అందుకే ప్రతీ ఒక్కరు రాహుల్ మరియు వరుణ్ లకు ఓట్ వేసి సేవ్ చెయ్యాలి అని కోరుకుంటుంది.మరి పునర్నవి వీళ్ళ కోసం ఇక ముందు కూడా ఇలాగే ప్రమోషన్స్ చేస్తుందో లేదో చూడాలి.

error: Content is protected !!