సైరా దెబ్బకి రిపేర్లకు దిగిన రాజమౌళి..భయం పట్టుకుందా..?

సైరా సినిమాకి అన్ని చోట్ల మంచి టాక్ వచ్చింది. కానీ వసూళ్లు మాత్రం కేవలం ఒక్క తెలుగులోనే వస్తున్నాయి. తమిళనాడు,కర్ణాటక,కేరళ అలాగే హిందీ బెల్ట్ నుండి అనుకున్న స్థాయిలో వసూళ్లు రావటం లేదు. అక్కడ వసూళ్ల పరంగా డిజాస్టర్ దిశగా సాగుతుంది సైరా సినిమా, ఎందుకు ఇలా జరుగుతుందని అరా తీస్తే కొన్ని విషయాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైంది ఈ సినిమాని అన్ని భాషలు వాళ్ళు ఓన్ చేసుకోలేకపోతారు.

ఈ సినిమా మొత్తం తెలుగు రాష్ట్రంలోని ఒక మారుమూల ప్రాంతంలో జరిగినట్లు చూపించారు. కాబట్టి కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే ఓన్ చేసుకున్నారు తప్పితే మిగతా వాళ్ళు దానిని రిసీవ్ చేసుకోలేకపోయారు, సరిగ్గా ఇదే పాయింట్ ఇప్పుడు రాజమౌళికి సమస్యగా మారింది. ఆయన తీస్తున్న RRR సినిమాలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీం ఇద్దరు కూడా తెలుగునేలకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ గురించి చెపుతుంటే ఖచ్చితంగా తెలుగు అనే ఫీలింగ్ వస్తుంది, అది వస్తే సినిమా కేవలం తెలుగు సినిమాగా ముద్ర పడుతుంది పాన్ ఇండియా ముద్ర పడటం కష్టం అవుతుంది.

దీనితో రాజమౌళి తాజాగా స్టోరీ విషయంలో చిన్న చిన్న మార్పులు చేయటానికి సిద్దమైనట్లు తెలుస్తుంది. ఎక్కువగా తెలుగు నేటివిటీ అనేది కనిపించకుండా, ఇదొక పాన్ ఇండియా సినిమా అనే ఫీలింగ్ వచ్చేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణహించుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు తీసిన దానిని ఏమి మార్చకుండా మున్ముందు తీసే వాటి మీద ప్రత్యేకమైన శ్రద్ద పెడుతున్నట్లు తెలుస్తుంది.

error: Content is protected !!