జగన్ అపాయింట్ మెంట్ చిరుకి ఎందుకు..?

మెగాస్టార్ చిరంజీవి తాను నటించిన సైరా సినిమాని సినీ రాజకీయ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా చూపిస్తూ, వారి అభినందనలు పొందుతూ అదే సమయంలో సినిమాకి ప్రమోషన్స్ చేస్తూ ముందుకి వెళ్తున్నాడు. రీసెంట్ గా తెలంగాణ గవర్నర్ సౌందరరాజన్ ఫ్యామిలీకి స్పెషల్ షో వేపించాడు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కి సినిమా విశేషాలు చెప్పాలని, కుదిరితే జగన్ కూడా సినిమా చూసే ఏర్పాటు చేయాలనీ చిరంజీవి భావించినట్లు తెలుస్తుంది.

అందుకోసం ముందుగా జగన్ ని కలవటానికి అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తుంది. నిజానికి జగన్ ముఖ్యమంత్రి అయినా తర్వాత టాలీవుడ్ పెద్దలు ఎవరు జగన్ ని కలిసింది లేదు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అశ్వినీదత్, దిల్ రాజు లాంటి వాళ్ళు కలవాలని అనుకున్న కానీ జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. మరి ఇప్పుడు చిరంజీవి కోసం ఇస్తాడా లేదా అనేది చూడాలి.

ఎలాగైనా జగన్ అపాయింట్ మెంట్ కోసం చిరంజీవి గట్టిగానే ట్రై చేస్తున్నట్లు సమాచారం. 30 ఇయర్స్ పృథ్వి తో సహాయం ఇందుకోసం తీసుకున్నట్లు తెలుస్తుంది. జగన్ ని కలిసి ముఖ్యమంత్రి అయినందుకు విషెష్ చెప్పి, అలాగే సైరా సినిమాకి స్పెషల్ షోలు పర్మిషన్ ఇచ్చినందుకు కూడా ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలియచేయాలని చిరంజీవి అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఒక పక్క పవన్ కళ్యాణ్ జగన్ మీద ఆరోపణలు చేస్తున్న కానీ, అవేమి పట్టించుకోకుండా సైరాకి స్పెషల్ పర్మిషన్స్ ఇచ్చిన జగన్ ఇప్పుడు చిరంజీవికి అపాయింట్ మెంట్ ఇచ్చే అవకాశం ఉంది.

error: Content is protected !!