జగన్ మరొక కీలక నిర్ణయం – నేతన్నల కోసం కొత్త పథకం

రాష్ట్రాభివృద్ధికి ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ, రాష్ట్రంలో కొత్త కొత్త పథకాలు పెట్టి, ప్రజలందరి బాగు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మరొక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని నేతన్నలందరి కోసం ఈ నూతన పథకాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆర్థికంగా ఆదుకునేందుకు సీఎం జగన్ సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటనలు జరీ చేసింది. కాగా చేనేత కార్మికుల కోసం డిసెంబర్‌ 21న “వైఎస్సార్‌ నేతన్న నేస్తం” పథకాన్ని ప్రారంభించనున్నారు.

కాగా ఆంధ్రప్రదేశ్ లో కేవలం చేనేత మగ్గం పై ఆధారపడి బతుకీడుస్తున్నటువంటి చేనేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక పరంగా చేయూతను అందించడానికి ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పేరుతో ప్రతి నేతన్న కుటుంబానికి ప్రతీ సంవత్సరానికి గాను రూ. 24 వేలు చొప్పున అందించనున్నారు. కాగా ఈ పథకం డిసెంబర్ 21 నుంచి అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రవాణా, పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పేర్ని నాని అధికారికంగా వెల్లడించారు.

error: Content is protected !!