బన్నీ ఫ్యాన్స్ ఉత్సాహానికి బ్రేక్ పడిందే….నిరాశ తప్పదు

అలవైకుంఠపురంలో మూవీ సామజవారగమనా సాంగ్ బంపర్ హిట్ తరువాత త్రివిక్రమ్ బన్నీ మరో పాటతో ఫ్యాన్స్ ను ఫిదా చేయడానికి సిద్ధమయ్యారు. దీపావళి కానుకగా వీరు ‘రాములో రాములా… ‘ అని సాగే ఓ పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నేడు ఈపాట టీజర్ ని విడుదల చేయనున్న చిత్ర యూనిట్, ప్రకటించింది. కారణమేమో కానీ టీజర్ విడుదల తేదీని రేపటికి వాయిదా వేశారు. దీనితో ఆతృతగా ఎదురు చూస్తున్న బన్నీ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లారు. ఇది పూర్తిగా మాస్ బీట్ తో సాగేసాంగ్ అని ఆ లిరిక్స్ చూస్తే అర్థం అవుతుంది. ఒక క్లాస్ పార్టీ లో చేతిలో మందు గ్లాసుతో బన్నీ మాస్ బీట్ అందుకోవడం ఆసక్తి కలిగిస్తుంది. మత్తులో… బన్నీ ఫ్యాన్స్ కిక్కెకించే మాస్ సెట్స్ తో ఈ పాటలో రెచ్చిపోతాడు అనిపిస్తుంది. మరి ఈ సాంగ్ తీరేదో తెలియాలంటే ఇంకో రోజు ఆగాల్సిందే.

ఇక అలవైకుంఠపురం టీం ప్రస్తుతం బన్నీ పై కొన్ని పోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం. దువ్వాడ జగన్నాథం చిత్రంలో బన్నీకి జంటగా నటించిన పూజా హెగ్డే మరో మారు అలవైకుంఠపురంలో అతనికి హీరోయిన్ గా నటిస్తుండగా, టబు, సుశాంత్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

error: Content is protected !!