ఫ్లిప్ కార్ట్ లో ఆఫర్ సేల్ ప్రారంభం.. ఈ మొబైల్స్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ నిర్వహిస్తున్న బిగ్ దీవాలీ సేల్ నేడు ప్రారంభమైంది. ప్రస్తుతం పండగ సీజన్ నడుస్తున్న సందర్భంగా ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే రెండు సార్లు ఆఫర్ సేల్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పండగ సీజన్ లో ఇదే ఆఖరి సేల్ అని, వినియోగదారులు ఏమైనా వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటే.. ఈ సేల్ లో అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయని ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ కు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన మైక్రో సైట్ లో పేర్కొంది. చెప్పినట్లే తన దగ్గర ఉన్న మొబైల్స్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్లను ప్రకటించింది. ఏయే మొబైల్స్ పై ఎంతెంత డిస్కౌంట్ ప్రకటించిందో ఓ లుక్కేయండి మరి!

గూగుల్ పిక్సెల్ 3ఏ, 3ఏ ఎక్స్ఎల్
ఈ బిగ్ దీవాలీ సేల్ లో భాగంగా గూగుల్ పిక్సెల్ 3ఏ, 3ఏ ఎక్స్ఎల్ లపై ఫ్లిప్ కార్ట్ భారీ తగ్గింపులను అందించింది. ఇందులో 64 జీబీ వేరియంట్ ఎమ్మార్పీ రూ.39,999గా ఉండగా, దీనిపై ఏకంగా రూ.10 వేలు తగ్గించి రూ.29,999కే ప్రస్తుతం ఈ ఫోన్ ను విక్రయిస్తోంది. మీ పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్ చేంజ్ చేసుకుంటే గరిష్టంగా మరో రూ.14 వేల తగ్గింపును పొందవచ్చు. అలాగే రూ.44,999 ఎమ్మార్పీగా ఉన్న పిక్సెల్ 3ఏ ఎక్స్ఎల్ పై కూడా రూ.10 వేల తగ్గింపును అందించారు. దీంతో ఆ ఫోన్ రూ.34,999కే లభించనుంది. మీరు పిక్సెల్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకుంటే, ఇంతకంటే మంచి సమయం మరోటి ఉండదు. పిక్సెల్ 4 సిరీస్ ఫోన్లు మన దేశంలో లాంచ్ అవ్వవు అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి.

బ్లాక్ షార్క్ 2
గేమింగ్ ఫోన్లలో ముందు వరుసలో ఉండే బ్లాక్ షార్క్ 2 మొబైల్ పై ఈ సేల్ లో ఏకంగా రూ.15 వేల తగ్గింపును అందించారు. రూ.44,999 ఎమ్మార్పీగా గల ఈ ఫోన్.. ఈ సేల్ లో రూ.29,999కే లభించనుంది. ఇందులో 6.39 అంగుళాల డిస్ ప్లేను అందించారు. వెనకవైపు 48 మెగా పిక్సెల్ కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. గేమింగ్ ప్రధానంగా రూపొందించారు కాబట్టి, ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ ను ఉపయోగించారు. ఇందులో 6 జీబీ ర్యామ్ కూడా ఉంది.

ఐఫోన్ 7
గత నెలలో తాజా ఐఫోన్లు లాంచ్ అవ్వడంతో ఐఫోన్ 7 ధర రూ.29,990కు తగ్గిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫెస్టివల్ సేల్ లో భాగంగా దీని ధర రూ.26,999కు తగ్గింది. దీంతో పాటు మీరు మీ పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్ చేంజ్ చేసుకుంటే.. అదనంగా మరో రూ.11,900 వరకు డిస్కౌంట్ లభించనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డుతో మీరు ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే మీకు అదనంగా మరో 10 శాతం తగ్గింపు లభించనుంది.

రెడ్ మీ నోట్ 7ఎస్
షావోమి సంస్థ ఈ సంవత్సరం లాంచ్ చేసిన ఫోన్లలో ఎక్కువగా అమ్ముడుపోయిన రెడ్ మీ నోట్ 7ఎస్ పై కూడా ఈ సేల్ లో రూ.4 వేల డిస్కౌంట్ ను అందించనున్నారు. రూ.13,999 విలువైన ఈ ఫోన్ ను ఈ ఫెస్టివల్ సేల్ లో రూ.9,999కే విక్రయిస్తున్నారు. ఒకవేళ మీరు ఆన్ లైన్ పేమెంట్ చేసినట్లయితే.. మీకు మరో పది శాతం అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ రూ.8,999కే మీ సొంతమవుతుంది. మీ పాత స్మార్ట్ ఫోన్ తో ఎక్స్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే.. మీకు అదనంగా మరో రూ.9,500 తగ్గింపు లభిస్తుంది.

వివో జెడ్1 ప్రో..
వివో సంస్థ రూపొందించిన స్మార్ట్ ఫోన్ వివో జెడ్1 ప్రో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,990గా ఉండగా, ఈ సేల్ లో దీన్ని రూ.12,990కే విక్రయిస్తున్నారు. మీ పాత ఫోన్ ను ఎక్స్ చేంజ్ చేసుకుంటే గరిష్టంగా మరో రూ.12 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. ఆన్ లైన్ లోనే నగదు చెల్లించి కొనుగోలు చేస్తే మరో పది శాతం తగ్గింపు కూడా లభిస్తుంది.

కేవలం ఈ ఫోన్లపై మాత్రమే కాకుండా అసుస్ 6జెడ్, రెడ్ మీ కే20, కే20 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఏ50, శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఒప్పో ఎఫ్11 ప్రోలపై కూడా ఫ్లిప్ కార్ట్ లో తగ్గింపు ధరలను అందించారు.

error: Content is protected !!